“బెంగళూరులో రన్యా రావు వద్ద 14.8 కిలోల బంగారం పట్టివేత”

Share


బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు వద్ద నుంచి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు.

రన్యా రావు తరచూ దుబాయ్ ప్రయాణాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. గత 15 రోజుల్లోనే ఆమె నాలుగు సార్లు దుబాయ్ వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించిన అధికారులు, ఎయిర్ పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టారు.

తన లగేజీని పరిశీలించగా 14.8 కిలోల బంగారం దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె నుంచి తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై DRI బృందం ముమ్మరంగా విచారణ ప్రారంభించింది. రన్యా రావుకు ఎవరైనా సహకరించారా, ఇంకా పెద్ద ముఠా ఉన్నదా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

రన్యా రావు కన్నడ చిత్రసీమలో నటిగా పేరుపొందారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘మాస్టర్ పీస్’, ‘చంద్రిక’, ‘వాఘా’, ‘పటాకీ’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే, ఆమె స్మగ్లింగ్ వ్యాపారంలో అనుబంధం ఉన్నదో లేదో, లేదా ఆమెను ఇరికించినట్టు ఉంటుందో అన్నది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది.

ఈ కేసును సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించేందుకు DRI బృందం సిద్ధంగా ఉంది.


Recent Random Post: