
మాస్ మహారాజా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో తన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెల్చుకున్న భామ భాగ్యశ్రీ బోర్సే. ఆరంగేట్రం మిస్టర్ బచ్చన్‌తో చేసిన ఆమె, రెండో సినిమాగా విజయ్ దేవరకొండతో కింగ్డమ్లో నటించింది. ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ కాకపోయినా, భాగ్యశ్రీకి టాలీవుడ్లో అవకాశాల కోసం ఇబ్బంది లేదు.
తన అందం, అభినయం కారణంగా వరుస ఆఫర్లు ఎదురైన భాగ్యశ్రీ, నవంబర్‌లో ఒక పెద్ద పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె నటించిన రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కాంత్, ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించడం తెలిసిందే.
కాంత్ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, మలయాళ భాషల్లో దుల్కర్ క్రేజ్ కారణంగా ఈ పీరియోడల్ డ్రామాపై భారీ బజ్ నెలకొంది. భాగ్యశ్రీ ఇందులో తన క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి ఫలితం సాధించాలనుకుంటోంది. ఇలా జరిగితే కాంత్ భాగ్యశ్రీ ఖాతాలో తొలి హిట్‌గా నిలుస్తుంది.
అదే నెలలో భాగ్యశ్రీ మరో సినిమా ఆంధ్రా కింగ్ తాలూకాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా ఒక హీరో అభిమాని జీవితంపై ఆధారపడి రూపొందింది. ఇందులో భాగ్యశ్రీ ఓ ఎనర్జిటిక్ రోల్లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం, ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచాయి.
ఈ రెండు సినిమాల ద్వారా భాగ్యశ్రీ తన ప్రత్యేక గుర్తింపును సాధించి, కెరీర్‌కు బూస్ట్ పొందాలని చూస్తోంది. నవంబర్ నెల చివరి ఫలితాలు భాగ్యశ్రీకు ఎంత మేరకు విజయాన్ని అందిస్తాయో చూడటం ఆసక్తికరంగా ఉంది.
Recent Random Post:














