మట్టి వాసన మాసిపోని తపోవనం.. జగపతి మాతృమూర్తి ఇల్లు చూసారా?

పరిశ్రమలో సీనియర్ గా సూటిగా మాట్లాడినా ఘాటుగా మాట్లాడినా జగపతిబాబు అలియాస్ జగ్గూ భాయ్ కే చెల్లింది. ఉన్నదున్నట్టు మాట్లాడడం అతడి నైజం. భయం బెరుకు జాన్తా నయ్! ఒక రకంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ తరహాలోనే సూటిగా ఉండే స్వభావం అతడిని ప్రత్యేకంగా ఉంచుతుంది. ఇతర హీరోలతో పోలిస్తే ఎంతో అడ్వాన్స్ డ్ థాట్స్ తో ఆకట్టుకుంటాడు. ఆధునిక సమాజం పోకడల గురించి నేటితరం గురించి బాగా ఆర్థం చేసుకుని తాను అప్ డేట్ అవుతాడు. కులం గోడు పట్టనివాడు.. మంచి మమత తెలిసిన వాడు.

దసరా బుల్లోడు వంటి క్లాసిక్ ని తీసిన మేటి నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా అతడు తన ప్రత్యేకతను ప్రతిసారీ ఆవిష్కరిస్తూనే ఉన్నారు. హీరోగా దశాబ్ధాలు ఏలాడు. తర్వాత టైమ్ చూసి టైమ్ బాంబ్ లా విలన్ అవతారం ఎత్తాడు. అక్కడా పెద్ద సక్సెస్. ఇటీవల యువ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ .. విలన్ గా నటిస్తూ కెరీర్ రన్ ఆగకుండా కంటిన్యూ చేస్తున్నాడు. తనతో పాటు పరిశ్రమకు పరిచయమైన చాలా మంది హీరోలు ఏమయ్యారో కూడా తెలీని సన్నివేశంలో ఉంటే జగ్గూభాయ్ మాత్రం క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు.

శ్రీరామ నవమి సందర్భంగా జగపతి బాబు షేర్ చేసిన ఓ వీడియో వెబ్ లో హాట్ టాపిక్ గా మారింది. అతడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతో తన మూలాలను మర్చిపోకుండా తన తల్లిగారి ఇంటికి వెళ్లాడు.

హైదరాబాద్ లోని తన మాతృమూర్తి నివశించే ఇల్లు చూపిస్తూ స్పెషల్ వీడియో పోస్ట్ చేసాడు. అది వెబ్ లో వైరల్ గా మారింది. రామ నవమి సందర్భంగా పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని చెబుతూ.. ప్రజలందరికీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

”అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు.. నూకలతోప కావాలన్నా. ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది. చాలా కాలం తర్వాత అమ్మ చేతితో మంచి భోజనం చేసాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. హ్యాపీగా ఉంటుంది.

ఒక యోగి- యోగిని అంటారే ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది. ఓకే బై బై” అంటూ జగపతి బాబు తన మాతృమూర్తి నివశించే ఇంటిని పరిచయం చేశారు. ఆ ఇల్లు ఒక ఆశ్రమంలా తపోవనంలా ఎంతో అందంగా ఉంది. చుట్టూ పచ్చని మొక్కలు పూలతో ఆహ్లాదమైన అడవిని తలపించింది. ఇంట్లోకి వెళ్లాగానే రుషి బొమ్మ.. చెట్లతో ఆహ్లదకర వాతారవరణం ఆకట్టుకుంది. ఇలాంటి ఇల్లు హైదరాబాద్ నడిబొడ్డున ఉంది అంటే అది నాటితరం అభిరుచి అని భావించాలి. జగ్గూభాయ్ ని కన్నతల్లికి హ్యాట్సాఫ్ చెప్పాలి.


Recent Random Post: