
భారత సినిమా రంగాన్ని తన ప్రత్యేక శైలితో మలిచిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలోని గొప్ప దర్శకుల్లో ఆయన పేరు ముందుంటుంది. ప్రేమకథలను దేశీయ సమకాలీన సమస్యలతో ముడిపెట్టి, భావోద్వేగంగా చూపించడంలో ఆయనకు సమానం కొరగానే లేరు.
గీతాంజలి, రోజా, బొంబాయి, దిల్ సే లాంటి మాగ్నం ఓపస్ సినిమాలతో మణిరత్నం ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు చెప్పడం ఆయన స్పెషాలిటీగా నిలిచింది. నిజంగా చెప్పాలంటే ప్రేమకథలపై మణిరత్నం “పీహెచ్డీ” చేశారని అభిమానులు చెప్పుకొంటారు.
అయితే ఇటీవల కాలంలో మణిరత్నం సినిమా ఫామ్ కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ రెండు భాగాలు హిట్ అయినా, కమల్ హాసన్‌తో చేసిన థగ్ లైఫ్ ట్రైలర్ చూసి మణిరత్నం ట్రాక్ తప్పారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై “అవుట్‌డేటెడ్” అన్న కామెంట్లు కూడా వినిపించాయి.
ఇలాంటి సమయంలో మణిరత్నం మళ్లీ ఒక క్లాసిక్ లవ్ స్టోరీతో రావడానికి సిద్ధమవుతున్నారని టాక్. ఈసారిగా కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్, మలయాళీ బ్యూటీ రుక్మిణి వసంత్ జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, నవంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాలో మణిరత్నం తన క్లాసిక్ లవ్ స్టోరీ మాజిక్ తిరిగి చూపించబోతున్నారా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
తాజా పరిస్థితుల్లో మణిరత్నం నుండి మరో రోజా… మరో బొంబాయి… లేదా దిల్ సే రేంజ్ మూవీ వస్తుందేమో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి మణిరత్నం మ్యాజిక్ వెనక్కి వస్తుందా? వేచి చూడాల్సిందే!
Recent Random Post:















