మహేష్ బాబును బాగా ప్రభావితం చేసిన ‘శివ’ సినిమా

Share


ఇప్పుడెక్కడ చూసినా ‘శివ’ రీ-రిలీజ్ గురించే చర్చ జరుగుతోంది. నవంబర్ 14 వరకు ఈ చర్చ కొనసాగనుంది. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ ‘శివ’ గురించి మాట్లాడుకుంటోంది. స్టార్ హీరోల నుండి దర్శకుల దాకా ప్రతి ఒక్కరూ ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

‘శివ’ విడుదలైన సమయంలో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నవాళ్లు — ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ — అందరూ అప్పటికి స్కూల్ పిల్లలే. ఆ సమయంలో ఈ సినిమా చూసిన అనుభూతిని వీళ్లంతా తాజాగా పంచుకుంటున్నారు.

ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి **‘శివ’**తో ఉన్న అనుబంధం చాలా గాఢం. మహేష్ మాట్లాడుతూ, తాను ఎక్కువసార్లు చూసిన చిత్రం ఇదేనని పేర్కొన్నారు. “నాలుగైదు సార్లు కాదు, మొత్తం పది సార్లు ‘శివ’ సినిమాను చూశాను. తొలిసారి చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. రెండు రోజుల తరువాత మళ్లీ చూసాను. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా అది,” అని తెలిపారు. ఇంతవరకు ఏ సినిమా గురించీ ఇంతగా చెప్పని మహేష్, ‘శివ’ తనపై బలమైన ప్రభావం చూపిందని స్పష్టం చేశారు.

‘శివ’ విడుదల సమయానికి మహేష్ ఇప్పటికే బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలో పాప్యులర్ అయ్యారు. 1979లో ‘నీడ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్, ఆ తర్వాత ‘పోరాటం’, ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’, అలాగే 1988లో ‘ముగ్గురు కొడుకులు’, 1989లో ‘గుఢచారి 117’ చిత్రాల్లో నటించారు. అదే ఏడాది ‘శివ’ విడుదలైంది. ఆ సమయంలో బాల నటుడిగా మహేష్ కెరీర్ పీక్స్‌లో ఉండేవారు. అయితే ‘గుఢచారి 117’ తర్వాత నాలుగైదు సినిమాలు చేసిన ఆయన, దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తీసుకుని 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

చాలా మంది స్టార్ వారసుల కెరీర్‌లపై ‘శివ’ సినిమా బలమైన ప్రభావం చూపింది. ఈ చిత్రం చూసి హీరోలు కావాలని ప్రేరణ పొందిన వారు ఎన్నోమంది ఉన్నారు. అలాగే ఆ సమయంలో ఉన్న కొత్త దర్శకుల్లో చాలామంది రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేయాలని కలలు కన్నారు.


Recent Random Post: