మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో ప్రియాంక చోప్రా?

మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ప్రియాంక చోప్రా గాయ‌కుడు, న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికాలో సెటిలయ్యాక కేవ‌లం హాలీవుడ్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తోంది. సిటాడెల్ సీజ‌న్- 1 లో న‌టించిన పీసీ ఇప్పుడు సీజ‌న్ 2లో కూడా న‌టిస్తోంది. అయితే ప్రియాంక చోప్రా హిందీ చిత్ర‌సీమ‌కు తిరిగి వ‌చ్చేదెప్పుడు? అంటూ అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు.

ఇంత‌కుముందు ఫ‌ర్హాన్ అక్త‌ర్ దర్శ‌క‌త్వంలో ‘జీలే జ‌రా’ చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేసింది. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇందులో ఆలియా, క‌త్రిన లాంటి స్టార్లు కూడా నటించాల్సి ఉంది. కానీ మ‌ధ్య‌లోనే ఈ సినిమా ఆగిపోయింది. తాజా స‌మాచారం మేర‌కు ప్రియాంక చోప్రా ఒక సౌత్ సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆ మేర‌కు ఫిలింఫేర్ త‌న క‌థ‌నంలో ఈ వివ‌రాల్ని వెల్ల‌డించింది. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే మ‌హేష్ త‌న మేకోవ‌ర్ తో సిద్ధంగా ఉన్నాడు. రాజ‌మౌళి ఈ చిత్రాన్ని ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ కేట‌గిరీలో అత్యంత భారీగా తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. ప్రియాంక చోప్రా చివ‌రిగా స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హేష్ – రాజ‌మౌళి లాంటి క్రేజీ కాంబినేష‌న్ లో అవ‌కాశం అందుకోవ‌డం జాక్ పాట్ అనే చెప్పాలి. మ‌హేష్ మూవీలో పీసీ అయితే మేక‌ర్స్ అధికారికంగా దీనిని ధృవీక‌రించాల్సి ఉంది.


Recent Random Post: