మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్

Share


బాహుబలి తర్వాత, ప్రతి హీరో, కొంత మంది డైరెక్టర్లతో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా తమ ప్రతిభను పాన్ ఇండియా స్థాయిలో చూపించాలని ఉత్సాహపడుతున్నారు. కొందరు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సక్సెస్ అవుతున్నా, మరికొందరు విఫలమవుతున్నారు. రాజమౌళి నుంచి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వరకు, పాన్ ఇండియా డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. తమ తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా గా ప్రకటిస్తూ హంగామా చేస్తున్నారు.

వీరి తరహాలోనే డైరెక్టర్ మారుతి కూడా పాన్ ఇండియా ఫీట్ కోసం రెడీ అయ్యాడు. ఆయన డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా చిత్రం ది రాజా సాబ్‌, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌లు మంచి ఆదరణ పొందడంతో హైప్ సృష్టించాయి. అయితే ప్రాజెక్ట్ ఆలస్యం, అప్‌డేట్లు ఆలస్యంగా వచ్చడంతో అభిమానుల్లో కొంత అనుమానం ఏర్పడింది.

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అని తెలిసినప్పుడు, ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. ప్రభాస్ క్రేజ్‌కు తగిన స్థాయిలో సినిమా రూపొందించగలడా? అనే చర్చ నెట్టింట మొదలైంది. ఫస్ట్ టీజర్ విడుదలకు తర్వాత గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నట్లు ట్రోల్ అయ్యింది. ఇప్పటికే ది రాజా సాబ్‌ ట్రోలింగ్‌కు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, సాహనా.. సాహనా.. అనే పాట రిలీజ్ అయ్యాక కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ఇలాంటి పరిస్థితుల్లో, మారుతి ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా, హ్యూజ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోతో, భారీ బడ్జెట్‌తో, క్లిష్టమైన ఈ టెస్ట్‌ను పాస్ అవుతాడా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద భారీ స్థాయిలో, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమా, ప్రభాస్ క్రేజ్‌కు తగిన స్థాయిలో బిజినెస్ చేస్తుందా అనే అంచనాలు ఉన్నాయి.

కానీ, మారుతి ప్రభాస్ క్రేజ్‌కు తగిన స్థాయిలో ది రాజా సాబ్‌ను తెరపైకి తీసుకొచ్చితే, అందరి అంచనాలను మించిపోతూ, పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్‌లు చేస్తున్నారు.


Recent Random Post: