మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ & కొత్త ప్రాజెక్టుల హైలైట్స్

Share


మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్, లవ్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ — మూడు ఇండస్ట్రీల్లోనూ ఈ అందాల భామ ఎప్పటినుంచో తనదైన శైలిలో రాణిస్తోంది. పెద్ద స్టార్ హీరోలతో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా, తన టాలెంట్‌తో, స్మార్ట్ ప్లానింగ్‌తో కెరీర్‌ను లాంగ్‌రన్‌లో కొనసాగిస్తోంది.

సోషల్ మీడియాలో కూడా తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా డిజైనర్ మ‌నీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన లెహంగాలో ఈ మిల్కీ బ్యూటీ మంత్రముగ్ధుల్ని చేసింది. అందంతో మెరిసిపోతూ, అభిమానుల నుండి వావ్ కామెంట్స్ అందుకుంది. “మనీష్ జీ డిజైన్ చేసిన దుస్తుల్లో గ్లామరస్ లుక్ ఇవ్వడం ఒక గొప్ప అనుభూతి. ఆ కోచర్ పార్టీ ప్రత్యేకంగా అనిపించింది. ఎంత అద్భుతమైన రాత్రి! INAYA అనేది స్వచ్ఛమైన కవిత్వంలా అనిపించింది. మీలాంటి వారు మాత్రమే గ్లామర్‌ను ఈ స్థాయిలో మలచగలరు” అంటూ తమన్నా సోషల్ మీడియాలో మనీష్ మల్హోత్రాను ప్రశంసించింది.

కెరీర్ పరంగా చూసుకుంటే, ఇటీవల తమన్నా ఓదెలా 2 సినిమాలో కనిపించింది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో హెబా పటేల్ మరో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 చిత్రంలో “నాషా” అనే ప్రత్యేక గీతంలో తమన్నా మెరిసింది.

అదేవిధంగా, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ డేరింగ్ పార్టనర్స్లో డయానా పెంటీతో కలిసి నటించింది. ఈ సిరీస్‌లో జావేద్ జాఫెరి, నకుల్ మెహతా తదితరులు కూడా నటించారు. సిరీస్ విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

ఇక అజయ్ దేవగన్, సంజయ్ దత్ లతో కలిసి అడ్వెంచర్ థ్రిల్లర్ రేంజర్ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఫారెస్ట్ రేంజర్‌గా, సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ సినిమా 2026లో విడుదల కానుంది.


Recent Random Post: