మిస్టర్ జీనియన్, గ్రాండ్ మాస్టర్ విశ్వనాద్ ఆనంద్ బయోపిక్ కొన్ని సంవత్సరాలుగా నెట్టింట నానుతోంది. కరోనాకి ముందు తన బయోపిక్ కి మిస్టర్ జీనియన్ అనుమతిచ్చాడు. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని రచ యితలతో పంచుకున్నట్లు తానే స్వయంగా వెల్లడించారు. అయితే ఇంతవరకూ ఆ బయోపిక్ తెరకెక్కింది లేదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ఆ బాధ్యతలు తీసుకున్నట్లు ప్రచారం సాగింది.
విశ్వనాధ్ పాత్రలో మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ పోషిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇదంతా నాలుగైదేళ్ల కిత్రం మాట. తాజాగా ఇదే బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడా బాద్యతలు తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తీసుకుం టున్నట్లు వినిపిస్తుంది. మహావీర్ జైన్- అశిష్ సింగ్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నట్లు సమాచారం. హీరో ఎవరు? అన్నది ఇంకా బయటకు రాలేదు గానీ…విజయ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ రాంగ్ ఆప్షన్ గా నెట్టింట నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆయన తీసిన జయలలిత బయోపిక్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. దీంతో విజయ్ సరైన ఆప్షన్ కాదంటున్నారు. ఈ విషయంలో నిర్మాతలు ఓసారి పునరాలించుకోవాలని కోరుతున్నారు. రైటర్ సంజయ్ త్రిపాఠి అయితే బాగుంటుందని సజ్జెస్ట్ చేస్తున్నారు.
అతడు దర్శకత్వం వహించిన బిన్నీ అండ్ ఫ్యామిలీ మంచి సక్సెస్ అయిందని, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన చిత్రంగా గుర్తు చేస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం చాలా కాన్పిడెంట్ గా విజయ్ తోనే ముందుకెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా ఆనంద్ జీవితాన్ని వెండి తెరకు ఎక్కించడంలో స్పీడప్ అవుతారా? అన్నది చూడాలి.
Recent Random Post: