
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో నేరుగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా తమ పిల్లలను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తూ, వారికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు తమ వారసులను చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అయితే కొంతమంది పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఇండస్ట్రీకి దూరమవుతారు. అలా ఉన్నవారు సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వస్తే, వారిని చూసి అభిమానులు ఆశ్చర్యపోవడం సహజమే.
ఈ కోవలోకే వస్తోంది సీనియర్ హీరోయిన్ మీనా కూతురు నైనిక. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించిన నైనిక ఇప్పుడు పెద్దదై హీరోయిన్ రేంజ్ అందంతో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. భర్త విద్యాసాగర్ మరణం తర్వాత మీనా తన కూతురితోనే కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు నైనిక ఫోటోలను పెద్దగా షేర్ చేయని మీనా, తాజాగా క్రిస్మస్ సందర్భంగా కూతురితో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫోటోల్లో నైనిక లుక్ చూసి అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత అందంగా మారిపోయిందా?”, “హీరోయిన్లా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలామంది నైనిక త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
నైనిక ఐదు సంవత్సరాల వయసులోనే దళపతి విజయ్ నటించిన తేరి సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి చదువుపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నైనిక వయసు 14 సంవత్సరాలు. తాజా ఫోటోలు చూసిన అభిమానులు మాత్రం ఆమె మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తిగా కోరుకుంటున్నారు.
ఇక మీనా విషయానికి వస్తే.. 1982లో నెంజంగల్ సినిమాతో బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. శివాజీ గణేషన్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ బాలనటిగా 45కి పైగా సినిమాల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. 1990లో తెలుగులో నవయుగం సినిమాతో హీరో రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. అదే ఏడాది తమిళంలో హీరోయిన్గా అడుగుపెట్టింది. తెలుగులో చంటి, అల్లరి పిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా నిలిచింది. ముఖ్యంగా వెంకటేష్‌తో ఆమె జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
రీఎంట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మీనా, భవిష్యత్తులో తన కూతురు నైనికను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
Recent Random Post:















