
టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుసగా సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్‌కి ఈ మధ్యకాలంలో లక్ కాస్త అనుకూలంగా లేకపోతోంది. సీతారామం బ్లాక్‌బస్టర్‌తో తెలుగులో బలమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తరువాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం డెకాయిట్ సినిమాలో బిజీగా ఉంటూ, బాలీవుడ్లో కూడా స్టార్ క్రేజ్ కోసం శ్రమిస్తోంది. ఈ మధ్యే విడుదలైన సన్ ఆఫ్ సర్దార్ 2 ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం, కెరీర్‌పై ఒత్తిడిని పెంచింది.
ఇంతలోనే, మృణాల్ కెరీర్ ప్రారంభ దశలో నటించిన కుంకుమ భాగ్య సీరియల్ టైంలో కో-యాక్టర్ అర్జిత్ తనేజాతో చేసిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, అర్జిత్ “బిపాసా బసు నచ్చుతుంది” అన్నప్పుడే, మృణాల్ సరదాగా “వెళ్లి ఆమెనే పెళ్లి చేసుకో… ఆమెకన్నా నేనే బాగుంటా” అని చెప్పింది. ఆ సమయంలో కేవలం హాస్యంగా అన్న ఈ మాటలను ఇప్పుడు బయటకు లాగి, సౌత్‌లో క్రేజ్ వచ్చాక సీనియర్స్‌కి గౌరవం ఇవ్వడంలేదని విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం బిపాసా అభిమానులు కూడా సోషల్ మీడియాలో మృణాల్‌పై ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఒక హిట్ తర్వాతే తన క్రేజ్ నిలబడే పరిస్థితి ఉండగా, ఇలాంటి వివాదం కొత్త తలనొప్పి అయింది. బాలీవుడ్ ప్రాజెక్టులు పెద్దగా సక్సెస్ అవకపోవడంతో, మృణాల్ తెలుగు సినిమాలపై మరింత దృష్టి పెట్టాలని భావిస్తోంది. మరో విజయవంతమైన హిట్ దక్కితే, మృణాల్ మళ్లీ టాలీవుడ్లో హడావిడి చేసే అవకాశం ఖాయం.
Recent Random Post:














