
ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్లో పలు సినిమాలు విడుదలయ్యాయి. మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో రాజా సాబ్ తప్ప మిగిలిన అన్ని సినిమాలకు మంచి టాక్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవగా, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు కూడా మంచి వసూళ్లతో సూపర్ హిట్‌గా నిలిచింది.
నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో వినోదాత్మక కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ‘సంక్రాంతి బ్లాక్‌బస్టర్’ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకుడు బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాధారణంగా బాబీ తన సినిమాల హీరోలను తప్పించి ఇతర ఈవెంట్లలో పెద్దగా ఎలివేషన్లు ఇస్తూ మాట్లాడరు.
కానీ ఈ ఈవెంట్లో బాబీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి పేరు రావడమే. చిరంజీవితో బాబీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా చర్చల సందర్భంగా ఇటీవల మెగాస్టార్‌ను బాబీ కలిశారట. ఆ సమయంలో చిరంజీవి, నవీన్ పోలిశెట్టి సినిమా గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని బాబీ చెప్పారు.
అనగనగా ఒక రాజు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పానని, దానికి చిరంజీవి “నవీన్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో, ఈ తరం హీరోల్లో నాకు బాగా నచ్చిన హీరో అతడే” అని అన్నారని బాబీ తెలిపారు. తన సినిమా మన శంకరవరప్రసాద్ గారు విజయం సాధించినా కూడా, నవీన్ విజయంలో చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.
ఈ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు నవీన్‌కూ చెప్పలేదని బాబీ వెల్లడించడంతో, నవీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా ఈ తరం హీరోలకు మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ నుంచి ప్రశంసలు రావడం చాలా పెద్ద అచీవ్మెంట్. అది కూడా నేరుగా కాకుండా మరో వ్యక్తి ద్వారా చిరంజీవి ప్రశంసించడం వల్ల నవీన్‌కు ఆ మెగా మూమెంట్ మరింత స్పెషల్‌గా మారింది.
Recent Random Post:















