ఇండస్ట్రీ కి వారసులొచ్చినా..బంధువులొచ్చినా ఆరంభంలో ప్రోత్సాహం తప్పనిసరి. వాళ్లు నిలబడతారా? లేదా? అన్నది తర్వాత సంగతి. ముందు వాళ్లకొ మంచి ప్లాట్ ఇవ్వాలి. తొలి చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్ల డానికి కావాల్సినంత సహకారం అందించాలి. ఆ విషయంలో స్టార్ హీరోలు ఏమాత్రం వెనకడుగు వేయరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అన్ని పరిశ్రమల్లోనూ ఆ రకమైన ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది.
తాజాగా మేనకోడలు కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖానే రంగంలోకి దిగేసాడు. ఆయన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రి `ఫర్రే` సినిమాలో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. అలీజ్ మెయిన్ లీడ్ లో సామేంద్ర పాదీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాఠశాల నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో సాహిల్ మెహతా..రోనిత్ బోస్ రాయ్..ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ చేతుల మీదుగా జరిగింది. ఆయనే ట్రైలర్ లాంచ్ చేసారు.
అనంతరం చిత్ర యూనిట్ పనితనాన్ని ప్రశంసించారు. ఈ సినిమా రిలీజ్ వరకూ తన సహకారం ఉంటుందని మాటిచ్చాడు. అయితే ఆయన ఇలా మాట ఇవ్వడం వెనుక సినిమా కథ కూడా కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. స్కాలర్ షిప్ తో ఓ పెద్ద పాఠశాల్లో సీటు సంపాదించిన నియాతీ డబ్బుల కోసం తన స్నేహితులకు సహాయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంది? అనే కథాంశం కూడా సల్మాన్ కి బాగా నచ్చిందంటున్నారు.
సందేశాత్మక చిత్రాలకు ఎప్పుడూ ఆయన నుంచి సహకారం ఉంటుందని ప్రశంసించారు. బేసిక్ గా సల్మాన్ మానవతా వాది. సహాయాలు చేయడంలో ముందుంటారు. అందుకే అనాద బాలికని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి..చదివించి.. ఓ ఇంటిదాన్ని చేసారు. ఇంకా బయటకు చెప్పని ఎన్నో సహాయాలు నిత్యం సల్మాన్ చేస్తుంటారు. ఆరకంగా బాలీవుడ్ పరిశ్రమలో మంచి పేరున్న నటుడు సల్మాన్. కృష్ణ జింకల కేసు నుంచి సల్మాన్ బయట పడటానికి దాతృత్వం ప్రధాన కారణం అన్న సంగతి తెలిసిందే.
Recent Random Post: