మోగ్లీ విడుదల వాయిదా కారణం ఇదే

Share


యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోషన్, ఆ సినిమాలో సహాయక పాత్రలో కనిపించారు. ఆ తరువాత బబుల్ గమ్ ద్వారా హీరోగా మారారు. కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ, డెబ్యూ సినిమాగా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయారు. ప్రమోషన్స్ కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. స్టార్ హీరోలు సపోర్ట్ చేసినా, దర్శకుడు రవికాంత్ మంచి ట్రాక్ రికార్డు ఉన్నా, సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేదు.

అయితే ఇప్పుడు రోషన్ పూర్తిగా మోగ్లీ మీద నమ్మకం పెట్టుకున్నారు. కలర్ ఫోటో వంటి నేషనల్ అవార్డు విజేత చిత్రాన్ని రూపొందించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది.

కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన మోగ్లీ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వినూత్నమైన కథతో సినిమా వస్తుందనే క్లారిటీ ఇచ్చింది. దీంతో మోగ్లీపై ఆడియన్స్ దృష్టి పడింది. మేకర్స్ డిసెంబర్ 12 విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.

అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరికి విడుదలను మార్చే అవకాశం ఉన్నట్లు టాక్.

ఇది అంతా అఖండ 2 ప్రభావమే! నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న ఆ సినిమా తాజాగా విడుదల కావాల్సి ఉండగా, నిర్మాతల ఆర్థిక సమస్యలతో వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 12న అఖండ 2 విడుదల అవుతుందని టాక్ వస్తోంది. అదే రోజు మోగ్లీ రిలీజ్ అయితే ఓపెనింగ్స్ దెబ్బతింటాయి. మరుసటి రోజు రిలీజ్ చేసినా పెద్దగా కలెక్షన్లు రావు.

డిసెంబర్ 25 అంటే క్రిస్మస్‌కు ఇప్పటికే పలు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. దీంతో పోటీని తప్పించుకునేందుకు మేకర్స్ మోగ్లీ విడుదలను వచ్చే ఏడాది ఫిబ్రవరికి మార్చినట్లు తెలుస్తోంది.


Recent Random Post: