
మలయాళ చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకతను నిరూపించుకున్న మోహన్‌లాల్ తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఇటీవల విడుదలైన ఎల్2: ఎంపురాన్ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పొందింది. ఆరు దశాబ్దాల వయసులో కూడా మోహన్‌లాల్ యంగ్ హీరోలతో సమానంగా పోటీ పడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఎల్2 ఎంపురాన్ తర్వాత విడుదలైన “తుదరుమ్” సినిమాకూ మంచి స్పందన లభించింది.
ఇదిలా ఉంటే, కేరళలో మొదటి నాలుగు రోజుల్లో అత్యధికంగా ప్రేక్షకులను ఆకర్షించిన టాప్ 3 సినిమాల్లో మూడు కూడా మోహన్‌లాల్ సినిమాలే కావడం విశేషం. ఎంపురాన్ సినిమాను నాలుగు రోజుల్లో 25.65 లక్షల మంది వీక్షించగా, రెండో స్థానంలో ఉన్న లూసిఫర్ సినిమాను 18 లక్షల మంది, మూడో స్థానంలో ఉన్న తదురుమ్ సినిమాను 17 లక్షల మంది ప్రేక్షకులు థియేటర్లలో చూశారు. ఎంపురాన్, లూసిఫర్ రెండూ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందాయి. లూసిఫర్‌కు ఇది సీక్వెల్ కావడం గమనార్హం.
లూసిఫర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేయడం తెలిసిందే. మోహన్‌లాల్ ఈ అరుదైన ఫీట్ సాధించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వరుస విజయాలతో ఆయన ఇంకా ఎంతటి రికార్డులు సాధిస్తారో చూడాలి.
Recent Random Post:















