
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ మలయాళంలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన రీమేక్‌లు, సిరీస్‌లు అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు దృశ్యం, దృశ్యం 2 రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో మంచి రియాక్షన్ సొంతం చేసుకున్నాయి.
తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రెండు భాగాలు రీమేక్ అయి సూపర్ హిట్‌గా నిలిచాయి. తమిళంలో కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే రీమేక్ చేశారు, రెండో భాగం రీమేక్ కాలేదు. ఇప్పుడు మూడో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహన్‌లాల్, మీనా జంగటా నటిస్తూ, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ భాగాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయి, మేకర్స్ “గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు: దృశ్యం 3” అని ప్రకటించారు.
ఈ చిత్రం ఏప్రిల్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కానుందని డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే హిందీ వెర్షన్‌లో కొత్త కధతో తెరకెక్కుతున్నారని రాన rumors ప్రచారం జరిగింది. అయితే డైరెక్టర్ స్పష్టత ఇచ్చి, మూల కథతో, కొంత మార్పులు చేసుకుని హిందీ వెర్షన్‌ను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావనున్నట్లు చెప్పాడు.
తెలుగు రీమేక్ విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ లభించలేదు. వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రీమేక్ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదని, దీనిని జూలై నుంచి వర్క్ స్టార్ట్ చేసి, షూటింగ్ కూడా అదే సమయంలో ప్రారంభిస్తారనీ తెలిసింది. మలయాళ ‘దృశ్యం 3’కి సంబంధించి అన్ని రిలీజ్ ఫార్మాలిటీలు పూర్తయ్యాక, తెలుగు రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం హౌస్ నం.47’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా తర్వాతే ‘దృశ్యం 3’ షూటింగ్‌కు డేట్స్ కేటాయించబడతాయని ఇండస్ట్రీ స్ర్కోర్స్ చెప్పారు. జూన్-జూలై వరకు ఆదర్శకుటుంబం హౌస్ నం.47 ఎక్కువగా షూటింగ్ పూర్తవుతుందని, తరువాతే ‘దృశ్యం 3’ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
Recent Random Post:















