
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులలో ఎంతో ప్రియమైన హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో నటించిన ఆమె చాలా సినిమాలు హిట్ అవ్వడంతో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలు ప్రకటించకపోయినప్పటికీ, బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజా మూవీ దే దే ప్యార్ దే-2కి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
తాజా పోస్టులో రకుల్ తళ తళ మెరిసే లెహంగాలో ఫోజ్ ఇచ్చింది. ఫోటోకి ఇచ్చిన క్యాప్షన్‌లో “దీపావళి ఇదే లాస్ట్, కానీ ఆడియో యూజ్ చేయడం చివరి కాదు” అంటూ రాత్ బర్ హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించింది. స్లీవ్‌లెస్ టాప్‌తో నెట్టెడ్ చున్నీ, నెక్ చౌకర్, చెవి కమ్మలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి, అందంగా మెరిసిపోతోంది. ఆమె లేటెస్ట్ ఇన్‌స్టా పోస్టు, హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె నటించిన మూవీ రాత్ బర్ సాంగ్ కూడా చిత్ర యూనిట్ ద్వారా రిలీజ్ అయ్యి ఫాన్స్‌కి ఇష్టంగా మారింది.
దే దే ప్యార్ దే-2 మూవీలో అజయ్ దేవగన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ చిన్ననాటి స్నేహితురాలైన రకుల్‌ను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. అయితే, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువ, ముఖ్యంగా రకుల్ తండ్రి వయసు అజయ్ వయసుతో సమానంగా ఉండటం విశేషం. రకుల్ తల్లిదండ్రులు అజయ్‌తో పెళ్లికి అనుమతి ఇవ్వకపోవడంతో, రకుల్‌ను మరొక అబ్బాయికి పెళ్లి చేయాలని యోచిస్తారు. ఈ క్రమంలో అజయ్ రకుల్ తల్లిదండ్రులను ఎలా ఒప్పిస్తాడో సినిమా కథానికలో చూడాలి.
దే దే ప్యార్ దే-2 నవంబర్ 14న విడుదల కాబోతోంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగన్, ఆర్. మాధవన్ (రకుల్ తండ్రి పాత్ర) ముఖ్యపాత్రల్లో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా కాకుండా, ఆయుష్మాన్ ఖురానాతో పతి పత్నీ ఔర్ ఓ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లబోతోంది.
Recent Random Post:














