రజనీ – నెల్సన్ దిలీప్ కుమార్ మూడో మార్జ్!?

Share


కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జైలర్ సూపర్ హిట్‌ అయిన తర్వాత, సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది, అలాగే అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్న జైలర్ 2లో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్‌లో ఉంటారని సమాచారం, అలాగే యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇంతలో, నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్‌తో మూడోసారి కూడా వర్క్ చేయనున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే జైలర్ 2 షూటింగ్ 70% పూర్తయిందని తెలుస్తోంది. రీసెంట్‌గా ఆయన కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేశారని, దాన్ని రజనీకాంత్‌కు నేరుగా వివరించారన్న వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ స్క్రిప్ట్ ను చదివిన తర్వాత “స్టోరీ బాగుంది” అని అభిప్రాయపడ్డారని, స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ వార్త బయటపడ్డ వెంటనే నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రియులు రియాక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవైపు పలువురు అభిమానులు రజనీకాంత్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలో నెల్సన్ దిలీప్ కుమార్ బాగా తెలుసని అభినందిస్తున్నారు. జైలర్ సినిమాలో తలైవా స్వాగ్, స్టైల్‌ను గుర్తుచేస్తూ, మళ్లీ అదే ఎఫెక్ట్‌ను చూడాలనుకుంటున్నారు. మరోవైపు కొన్ని వర్గాలు ఈ వార్తల్లో నిజం ఉన్నట్టేనా అనేది సస్పెన్స్ గా చూస్తున్నారని, ఇంతంతా మూవీ ప్రమోషన్ కోసం అని కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా, రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో మూడో సినిమా నిజంగానే వస్తుందా అన్నది త్వరలోనే తెలుస్తుంది. అభిమానులు ఇప్పుడు ఆ విశేషం కోసం ఎదురుచూస్తున్నారు.


Recent Random Post: