రజినీకాంత్ – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ఫిక్స్!

Share


ఇప్పుడు మన సీనియర్ స్టార్లు కెరీర్‌లో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సీనియర్ డైరెక్టర్లకు బదులుగా యంగ్ టాలెంట్‌కు ఛాన్స్‌లు ఇస్తూ తాము ఇంకా ఫిట్‌గా ఉన్నామని చాటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే అనిల్ రావిపూడి వంటి యువ దర్శకులతో సినిమాలు చేస్తుండగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారు.

ప్రస్తుతం రజనీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ‘కూలీ’ తర్వాత రజనీకాంత్ మరో భారీ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ను ప్రారంభించనున్నారు. 2023లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘జైలర్’కు ఇది సీక్వెల్.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించే ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య విలన్‌గా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య ఇప్పటికే 20 రోజులు డేట్స్ కేటాయించినట్టు సమాచారం.

ఇవి పూర్తయ్యాక, రజనీకాంత్ మరో టాలీవుడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నానితో ‘సరిపోదా శనివారం’ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆత్రేయ, ఇటీవల రజనీకాంత్‌కు ఒక ఆసక్తికరమైన కథ వినిపించాడట. కథకు ఫిదా అయిన రజనీ వెంటనే ఒప్పుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇటీవల అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాను ప్రకటించిన మైత్రీ, ఇప్పుడు రజనీకాంత్ సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ టాక్. ఈ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే విడుదల కానుంది.

ఈ విధంగా రజనీ వరుసగా యువ దర్శకులతో చేతులు కలుపుతూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్నారు.


Recent Random Post: