
మాస్ మహారాజా రవితేజ తాజాగా విడుదలైన మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయి హిట్ కాలేకపోయింది. రవితేజ స్టైల్‌లో వచ్చిన పక్కా మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా అభిమానులు పెద్దగా స్పందించలేదు. గత కొన్నాళ్లుగా రవితేజ మాస్ సినిమాలు, ప్రయోగాత్మక కథలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. హిట్లు రాకపోయినా, తన జోష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
‘నేనింతే’ సినిమా డైలాగ్‌లానే — “సినిమా పోయినా ఇంకో సినిమా చేస్తాం… సినిమా హిట్టైనా ఇంకో సినిమా చేస్తాం…” అన్నట్టుగా, రవితేజ మరో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నాడు.
మాస్ జాతర రిలీజ్‌కు ముందే, రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాను లైన్‌లో పెట్టాడు. ఆ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్‌గా ప్లాన్ అవుతోంది. తాజాగా వచ్చిన టీజర్‌తో ఆ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
ఇక రవితేజ తర్వాతి ప్రాజెక్ట్‌గా శివ నిర్వాణతో చేతులు కలిపాడు. నిన్ను కోరి నుండి ఖుషి వరకు శివ నిర్వాణ తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టక్ జగదీష్, ఖుషి ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆయన స్టైల్‌కి అభిమానులు ప్రత్యేకంగా ఉన్నారు.
ఈసారి శివ నిర్వాణ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎమోషన్ జానర్‌లో స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. రవితేజకు ఆ కథ బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇది రవితేజ–సమంత మొదటి కాంబినేషన్ అవుతుంది. ఈ జోడీ ఫైనల్ అయితే ఫ్యాన్స్‌కి పండుగే.
సమంత ఇటీవల తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె బోలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేస్తోంది. అయితే రవితేజ–శివ నిర్వాణ సినిమా ఆఫర్‌కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
రవితేజ–శివ నిర్వాణ క్రైమ్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. సరైన సీరియస్ సబ్జెక్ట్ పడితే రవితేజ తన ఎనర్జీతో అదరగొట్టడం ఖాయం. శివ నిర్వాణ స్టోరీటెల్లింగ్, ఎమోషనల్ కంటెంట్ బలంగా ఉండటంతో, ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ ట్రీట్ ఇవ్వనుంది.
Recent Random Post:














