కేజీఎఫ్” తరువాత దక్షిణాది సంగీత ప్రపంచంలో మారుమ్రోగిన పేరు రవి బస్రూర్. భారీ యాక్షన్ డ్రామాలకు తగినంత ఇంటెన్స్‌గా, ప్రేక్షకుల హృదయాలను దద్దరిల్లించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంలో అతని ప్రతిభ అసాధారణం. “కేజీఎఫ్” విజయానికి అతని సంగీతం కీలకంగా మారింది. తాజాగా, “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్” లో కూడా రవి బస్రూర్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. పాటలు తక్కువగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, గత కొంతకాలంగా రవి బస్రూర్ పనితనం గురించి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. “కబ్జా,” “మార్టిన్,” “భీమా” వంటి చిత్రాల్లో ఆయన సంగీతం ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయిందనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. “జీబ్రా” లో కూడా సంగీతం కేవలం సరిపోయినంతగానే అనిపించింది.
ఇప్పుడేమో, “మార్కో” అనే చిత్రం ద్వారా రవి బస్రూర్ పేరు మళ్లీ గట్టిగా వినిపిస్తోంది. ఓ సాధారణ గ్యాంగ్‌స్టర్ రివెంజ్ డ్రామాకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు ఎంత స్టైలిష్‌గా తెరకెక్కించినా, దానికి సరిపడిన సంగీతం లేకపోతే తెర మీద అంతా వృథా అవుతుందనే చెప్పాలి. అయితే, “మార్కో” లో ఈ సమస్య రాలేదు. విలన్ గ్యాంగ్‌కు సైతం మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్యూన్‌లను కంపోజ్ చేయడంలో రవి తన టాలెంట్‌ని మరోసారి నిరూపించారు.
ఈ ఫలితం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో భారీగా ఆసక్తిని పెంచింది. కారణం? ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. దేవరకి అనిరుద్ రవిచందర్ ఎంత బాగా పనిచేశారో చూశాం. అదే విధంగా, రవి బస్రూర్ ఎన్టీఆర్ కోసం తన బెస్ట్ స్కోర్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. షూటింగ్ ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉంది.
ఇదే కాక, రవి బస్రూర్ ప్రస్తుతం మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నాయకత్వంలో రూపొందుతున్న “కాలియన్” చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభిమానులు రవి బస్రూర్ నుంచి ఒక సరికొత్త మ్యూజికల్ లవ్ స్టోరీ చూడాలని కోరుకుంటున్నారు.
మొత్తానికి, రవి బస్రూర్ మళ్లీ తన సంగీత ప్రస్థానంలో బ్లాక్ బస్టర్ లైన్‌లో నిలుస్తున్నాడు
Recent Random Post: