రష్మికదే రూల్: పాన్ ఇండియా క్వీన్‌కు పోటీ ఎవరూ లేరు!

Share


నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఇండస్ట్రీలో తనకే సాటి లేని స్థానం ఏర్పరుచుకున్నట్టు స్పష్టమవుతోంది. యానిమల్, పుష్ప 2, ఛావా వంటి భారీ ప్రాజెక్టుల విజయాలతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌డమ్‌కు చేరింది. ‘సికిందర్’ రూపంలో ఒక పరాజయం ఎదురైనా, దాని ప్రభావం రష్మిక కెరీర్‌పై ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమాను తప్ప ఇతర ప్రాజెక్టులన్నీ విజయాలు సాధించడమే కాకుండా ఆమె బ్రాండ్ విలువను మరింత పెంచాయి.

ప్రస్తుతం బాలీవుడ్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన రష్మిక, టాలీవుడ్ అవకాశాలను కూడా సమర్థంగా బ్యాలెన్స్ చేస్తోంది. మంచి కథలు వస్తే వెంటనే ఓకే చెబుతోందట. అంతేకాకుండా పారితోషికం విషయంలో కూడా తన స్థాయిని బాగా పెంచుకుంది. ఒక్కో సినిమాలో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ, తాను నిర్ణయించిన కండీషన్లను ఖచ్చితంగా పాటించాలని చెబుతోందట.

ఇక షూటింగ్ సెట్స్‌లో కూడా ఒక కొత్త ప్రమాణం అమలు చేస్తోందట. టైమ్‌కు వచ్చి, షెడ్యూల్ ముగియగానే వెళ్లిపోతుందట. అయితే, ద‌ర్శ‌క నిర్మాతలతో సహకారపూర్వకంగా వ్యవహరిస్తూ, వారిపట్ల గౌరవం చూపుతుందట.

ఈ స్థాయికి రష్మిక ఎందుకంత డిమాండ్ అంటే, ఆమె ఎనర్జీకి, స్క్రీన్ ప్రెజెన్స్‌కి సరిపోయే మరో నటి లేరన్నదే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. దర్శకులు, నిర్మాతలు కూడా ‘రష్మిక అయితేనే బిజినెస్ జరుగుతుంది’ అనే స్థాయికి చేరుకున్నారు. అందుకే, రూపాయి ఎక్కువైనా ఆమెనే తీసుకుందామని డిసైడ్ అవుతున్నారు. కొత్త భామలతో ప్రయోగం చేయాలన్నా, అదే స్థాయిలో కమర్షియల్‌ ఖచ్చితత రావడం కష్టమవుతోంది.

ఈ పరిస్థితుల్లో రష్మికకు ఇండస్ట్రీలో పోటీగా మరో నాయిక ఉందా? అనే ప్రశ్నకు, ప్రస్తుతం మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. ఆమె స్టార్డమ్, డిమాండ్, అనుభవం… ఇవన్నీ కలిసి ఆమెను టాప్‌ స్పాట్‌లో నిలబెట్టాయి.


Recent Random Post: