నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఐశ్వర్య రాజేష్ పై విమర్శలు చేస్తున్నారు. నీవెంత నీ స్థాయి ఎంత అంటూ రష్మిక అభిమానులు ఓ రేంజ్ లో సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్య రాజేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో ఐశ్వర్య రాజేష్ టీమ్ నుండి ఒక స్పష్టత వచ్చింది.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ త్వరలో ఫర్హాన అనే సినిమాను చేసింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక మీడియా సమావేశంలో ఐశ్వర్య రాజేష్ పాల్గొంది. ఆ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఫర్హాన సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రకు తాను బాగా సెట్ అవుతాను అని నా అభిప్రాయం అన్నట్లుగా ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను కొందరు కావాలని పుష్ప సినిమా లో రష్మిక కంటే కూడా తాను బాగా చేసేదాన్ని అంటూ వ్యాఖ్యలు చేసింది అంటూ ఐశ్వర్య రాజేష్ ను టార్గెట్ చేయడం జరిగింది.
నిజంగానే రష్మికని ఐశ్వర్య రాజేష్ అంతటి మాట అనేసిందా అంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఐశ్వర్య రాజేష్ టీమ్ నుండి ఒక నోట్ వచ్చింది. అందులో ఐశ్వర్య రాజేష్ ఆ మీడియా సమావేశంలో అసలు రష్మిక మందన్నా ను అవమానించినట్లుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
పుష్ప లోని శ్రీవల్లి పాత్ర తనకు బాగా సెట్ అవుతుందని భావించింది కానీ అంతకు మించి ఏమీ లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. రష్మిక మందన్నా ను అవమానించినట్లుగా ఎలా అవుతుందని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. కొందరు కావాలని ఐశ్వర్య రాజేష్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ వివాదం విషయంలో మరీ ఆలస్యం చేయకుండా ఐశ్వర్య రాజేష్ టీమ్ నుంచి క్లారిటీ రావడంతో మరింత దూరం ఈ గొడవ వెళ్లకుండా ఉండి పోయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రష్మిక మందన్నా అభిమానుల ట్రోల్స్ ఇకనైనా ఆగుతాయేమో చూడాలి.
Recent Random Post: