
నేషనల్ క్రష్‌గా పేరుపొందిన రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా సెటిల్ అవ్వడంలో కచ్చితంగా రికార్డు సృష్టించింది. ‘పుష్ప-2’ విజయం ఆమె కెరీర్‌ను ఆకాశానికి ఎత్తింది. ఆమె క్రేజ్ పెరిగి, స్టార్ హీరోలు కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. బెంగుళూరు నుండి వచ్చిన ఓ నటి ఇంతగా సక్సెస్ సాధించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం రష్మిక చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లోనూ భాగమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ఇందులో హిందీ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, కోలీవుడ్ నుండి రజనీకాంత్ లేదా కమల్ హాసన్ నటించనున్నారు.
స్టోరీ ఫైనల్ అయ్యింది, ఇక బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్‌ను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్నాని ఓ హీరోయిన్‌గా తీసుకోవాలని అట్లీ నిర్ణయించుకున్నాడట. రష్మిక కూడా ఈ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.
ఇప్పటికే సల్మాన్ ఖాన్‌తో ‘సికిందర్’ చిత్రంలో రష్మిక నటిస్తోన్న విషయం తెలిసిందే. అట్లీ చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలు గొప్ప స్కోప్‌తో ఉంటాయి, అలా రష్మికకు మంచి అవకాశం దొరికింది.
Recent Random Post:















