
సౌత్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ గట్టి మార్కెట్ ఏర్పరచుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, వరుస హిట్స్‌తో దూసుకెళ్తోంది. యానిమల్, పుష్ప 2: ది రూల్, ఛావా వంటి భారీ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి, సల్మాన్ ఖాన్ ‘సికందర్’ రూపంలో తొలి షాక్ తగిలింది. సినిమాలో ఆమె పాత్ర మృతిచెందినట్టుగా చూపించడంతో అభిమానులు నిరాశ చెందారు. అయినా రష్మికకు అవకాశాల జోరు మాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉండగా, రష్మిక టైటిల్ రోల్ పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మాత్రం ఎక్కడో స్టక్ అయిపోయినట్టు ఉంది. డిసెంబరులో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో టీజర్ విడుదల కాగా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ లేదు. చిలసౌ, మన్మధుడు 2 ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని – విద్య కొప్పినీడి కలిసి నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్ పరంగా చిన్నదైనా, రష్మిక బ్రాండ్ వాల్యూ వల్ల మల్టీ లాంగ్వేజ్ బిజినెస్‌తో మంచి క్రేజ్ ఏర్పడింది. షూటింగ్ పూర్తయిందని, కేవలం కొంత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయన్నది లేటెస్ట్ టాక్. అయితే ఓటీటీ డీల్ విషయంలో స్పష్టత రాకపోవడంతో విడుదల తేదీని లాక్ చేయలేకపోతున్నారని ఇండస్ట్రీలో చర్చ.
ఇక రష్మిక ప్రస్తుతం ధనుష్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా షూటింగ్‌తో పాటు, బాలీవుడ్ హారర్ సినిమా ‘తమ’ లోనూ బిజీగా ఉంది.
ఇప్పుడు ప్రశ్నేంటి అంటే… ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఎప్పుడు వస్తుంది?
ఫ్యాన్స్ అయితే ఒక్క పోస్టర్ అయినా విడుదల చేయమని ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే, మరోసారి రష్మిక మ్యాజిక్ చూడొచ్చని ఆశిస్తున్నారు.
Recent Random Post:















