రష్మిక మందన్న: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్

Share


నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, స్మార్ట్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ తన సినీ కెరియర్‌లో ఎత్తుని చేరుకుంది. ప్రస్తుతం ఆమె సౌత్ మరియు నార్త్ రెండు ఇండస్ట్రీలలో బిజీగా ఉన్నది. రష్మిక ఈ దశాబ్దంలో తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ — నాలుగు భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేయడం ప్రారంభించింది. అలాంటి విశిష్టమైన హీరోయిన్లలో ఆమె పాన్ ఇండియా స్థాయి గుర్తింపు పొందింది.

రష్మిక ఎల్లప్పుడూ భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. గీత గోవిందం నుంచి పుష్ప లోని శ్రీవల్లి, ఛావా లోని యేసు భాయి వంటి పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.

సినిమాలపైనే కాకుండా, రష్మిక వ్యాపార ప్రకటనల్లో, కవర్ పేజీల స్టిల్స్ లో కూడా హైలైట్‌గా నిలుస్తుంది. తాజాగా హర్పర్స్ బజార్ ఇండియా కవర్ పేజీకి ఇచ్చిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కవర్‌లో ఆమె వేసుకున్న ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్, గ్రాండ్ వింగ్డ్ డిజైన్ నెక్‌లైన్, స్నేక్ డిజైన్ వజ్రాల హారం, చెవి కఫ్స్ మరియు బ్రాస్లెట్ మొత్తం ఆమె స్టైలిష్ లుక్‌ని పెంచాయి.

మరో ఫోటోలో బ్లోని అటెలియర్ బస్టియర్ షార్ట్, గూచీ బూట్లు, మిలీనియం జెమా నెక్లెస్, స్వరోవ్స్కీ ఉంగరాలతో రష్మిక తన లుక్‌ని కంప్లీట్ చేశారు. ఈ కవర్ పేజీ స్టిల్స్ సోషల్ మీడియాలో హైలైట్‌గా మారాయి మరియు అభిమానులు ఫిదా అవుతున్నారు.

సినిమాల విషయానికి వస్తే, బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్‌తో కాక్‌టైల్ 2 షూటింగ్‌లో ఇటీవల రష్మిక పాల్గొన్నారు. టాలీవుడ్‌లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. లేడీ-ఓరియెంటెడ్ మైసా సినిమాను కూడా ఇటీవల ప్రకటించారు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా తో థామా సినిమాలో నటిస్తున్నారు. రష్మిక నటించిన సినిమాల సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. పుష్ప-3, యానిమల్ పార్క్, అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న AA22XA6 సినిమాలో కూడా రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది.


Recent Random Post: