రష్మిక వ్యాఖ్యలపై సోషల్ మీడియా సంచలనం!

Share


‘‘సినిమాను సినిమాగా చూడాలి… ఎవరైనా ఆ కంటెంట్‌తో ప్రభావితమవుతే, దాన్ని చిత్రంగా తీసుకోవాలి,’’ అని హీరోయిన్ రష్మిక మందన్న అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ సందర్భంగా రష్మికను ఓ ప్రశ్న అడిగారు — ‘‘రణ్‌విజయ్‌ (రణబీర్ కపూర్ పాత్ర – Animal సినిమాలో) లాంటి వ్యక్తితో మీరు నిజ జీవితంలో డేటింగ్‌కు సిద్ధమవుతారా?’’ అని. దానికి ఆమె తడబాటు లేకుండా ‘‘అవును, సిద్ధమే’’ అని సమాధానం ఇచ్చారు.

ఆమె అభిప్రాయం ప్రకారం, ప్రేమ మనల్ని మెల్లగా మారుస్తుంది. ‘‘ఎవరినైనా మనం ప్రేమించగలగడం లేదా మనల్ని ఎవరో నిజంగా ప్రేమించగలగడం వలన, మార్పు సహజంగానే వస్తుంది’’ అని రష్మిక వివరించారు.

అయితే హోస్ట్ స్పందనలో — ‘‘నిజ జీవితంలో అలాంటి మార్పులు సాధ్యం కావు’’ అని చెబుతూ అభిప్రాయపడ్డాడు. దానికి రష్మిక స్పందిస్తూ, ‘‘చిన్నప్పటినుంచి కలిసి పెరిగినవాళ్లయితే, వాళ్లలో మనకు నచ్చే, నచ్చని అంశాలు ముందుగానే తెలుసుకోవచ్చు. వాళ్లు ఎలా మారతారో, మేము ఎలా అర్థం చేసుకుంటామో కాలక్రమంలో తెలుస్తుంది’’ అని వివరణ ఇచ్చారు.

అయితే, ఈ వ్యాఖ్యలు కొన్ని నెటిజన్లకు అర్థం కాక విపరీతంగా ట్రోలింగ్‌కు దారితీశాయి. రష్మికపై విరుచుకుపడిన ట్రోలర్స్, ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రష్మిక చాలా తెలివిగా ఆడుతోంది”, “ఒక బింబోలా ఫీలవుతుంది”, “తను ఎక్కువగా మాట్లాడితే ఇష్టం లేదు” వంటి కామెంట్లు వరుసగా పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా, ఈ వివాదంలో విజయ్ దేవరకొండను కూడా కొన్ని సోషల్ మీడియా యూజర్లు లాగారు. ‘‘వీళ్లిద్దరూ మాట్లాడటం తగ్గించాలి’’ అంటూ సూచనలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.

మొత్తంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు సినీప్రపంచంలోనే కాక, సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీశాయి. అభిమానులు, నెటిజన్లు, విమర్శకులు — అందరూ ఈ వ్యాఖ్యలపై తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు.


Recent Random Post: