రాజకీయ రంగులోకి బిగ్ బాస్ 19

Share


ఇండియాలో ఒకప్పుడు విపరీతమైన పాపులారిటీ సంపాదించిన రియాలిటీ షో బిగ్ బాస్, ఇప్పుడు మాత్రం ఆ క్రేజ్‌ను మెల్లగా కోల్పోతుంది. మొదటి సీజన్లలో ఈ షో స్టార్ట్ అవుతుందని తెలుసుకున్న వెంటనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. సీజన్ మొత్తం టీవీ ముందు కూర్చుని ఫాలో అయ్యేవారు. కానీ సీజన్‌కి సీజన్ ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.

ప్రత్యేకంగా హిందీలో ప్రసారమయ్యే బిగ్ బాస్‌కి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్నప్పుడు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. ఆ రేటింగ్స్‌ను చూసి మేకర్స్ సైతం ఆశ్చర్యపోయేవారు. అయితే ఆ పాపులారిటీ కూడా ఇప్పుడు తగ్గిపోవడంతో, షోను మళ్లీ టాప్‌లోకి తీసుకురావడానికి నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.

ఈ క్రమంలోనే త్వరలో రాబోయే బిగ్ బాస్ సీజన్ 19ను పూర్తిగా కొత్త ఫార్మాట్‌లో తీసుకురాబోతున్నారని టాక్. ఈ సారి రాజకీయ రంగు జోడించబోతున్నారట. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్‌ను రెండు పార్టీలుగా విభజించి, రాజకీయ వాతావరణాన్ని పోలిన గేమ్‌ప్లే ప్లాన్ చేశారు. రెండు టీమ్స్ విడివిడిగా చర్చలు, వ్యూహాలు వేసుకుంటూ, ఒకరిపై ఒకరు దాడులు చేసేలా టాస్కులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ అంటే గొడవలు, వాదోపవాదాలు, టాస్కులు, ఎమోషన్స్ అన్నీ కలగలిపిన మిక్స్. కానీ సీజన్ 19లో ఈ గొడవల డోస్‌ను మరింత పెంచి, ప్రేక్షకుల్లో “ఇంకా ఏమవుతుందా?” అనే ఆసక్తిని రెట్టింపు చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రియల్ లైఫ్ పాలిటిక్స్ లాగే హౌస్‌లో కూడా పోటీ, విభేదాలు, వ్యూహాలు చోటుచేసుకుంటే కంటెంట్ మరింత మసాలా అవుతుందని వారు నమ్ముతున్నారు.

అయితే నెటిజన్లలో మాత్రం మిశ్రమ స్పందన ఉంది. “ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో గొడవలే ఎక్కువ… ఇప్పుడు రాజకీయాల మిశ్రమం వేసినట్లయితే, ఫైట్లు ఇంకా ముదురుతాయి” అంటున్నారు. గత సీజన్లలోనూ ఇలాంటి సన్నివేశాలు చూసినప్పటికీ, ఈసారి ఉద్దేశపూర్వకంగా గొడవలను పెంచడం కొత్త ట్రైగా భావిస్తున్నారు.


Recent Random Post: