రాజమౌళి సింప్లిసిటీ షాకిచ్చిన నిజాలు

Share


తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ పటంలో నిలబెట్టిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. స్టూడెంట్ నెం.1‌తో మొదలైన ఆయన ప్రయాణం బాహుబలితో పాన్-ఇండియా స్థాయికి చేరగా, RRR ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా కూడా భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి సినిమా అనగానే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోల పొడవాటి డేట్స్, టాప్ టెక్నీషియన్స్ ఇలా అన్నీ సులభంగా సెట్ అవుతాయి.

అయితే, ఇలాంటి భారీ రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి… బయటకు వెళ్లేటప్పుడు ఖాళీ జేబులతోనే ఉంటారని చెబితే నమ్మగలరా? ఇది నిజమే.
ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య రమా రాజమౌళి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవి:

రాజమౌళి బయటకు వెళ్లేటప్పుడు చేతిలో డబ్బు పెట్టుకోవడమే ఉండదట.

ఆయన ఎటు వెళ్లినా, డ్రైవర్‌కి కొంత క్యాష్, ఒక కార్డ్ ఇచ్చేది రమానే.

చెక్‌పై సరిగా సంతకం చేయలేరని, అందుకే చెక్ అధికారం కూడా ఆయన దగ్గర లేదట.

డబ్బు మీద రాజమౌళికి ఎలాంటి పట్టు లేదా ఆసక్తి ఉండదని ఆమె చెప్పారు.

“జీవితంలో చాలా కష్టాలను చూశాం. దిగువ స్థాయిలకు కూడా వెళ్లాం. ఇప్పుడైనా సంతోషంగా బ్రతకడమే ముఖ్యం” అని రమా చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇంత పెద్ద దర్శకుడు, కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి, తనకు లగ్జరీ మెయింటెనెన్స్‌పై ఎలాంటి ఇష్టం లేకుండా ఇంత సింపుల్‌గా ఉండటం చాలా మందికి షాకింగ్‌గా అనిపిస్తోంది. రాజమౌళికి ఒక్క అభిరుచి మాత్రమే — మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయడం, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం.

అందుకే ఆయన ఈ స్థాయికి ఎదిగారు… ఈరోజు భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడ్డారు.


Recent Random Post: