
ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మన్‌గా టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరో రాజశేఖర్ ఇప్పుడు తన కెరీర్లో ఓ సంక్షోభ దశను ఎదుర్కొంటున్నారు. భారీ హిట్లతో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన ఈ నటుడు గత దశాబ్దంగా మళ్లీ అదే స్థాయిలో నిలబడే ప్రయత్నాలు చేస్తున్నా, ఆశించిన ఫలితాలు రావడంలేదు.
సెకండ్ ఇన్నింగ్స్‌లోకి అడుగుపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నితిన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో కీలక పాత్రలో కనిపించినా, ఆ సినిమా ఫెయిలవడంతో పాటు రాజశేఖర్ పాత్రకీ నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో మళ్లీ వెనక్కి తగ్గాడు.
ఇటీవలకాలంలో నాన్-థియేట్రికల్ హక్కులు కీలకంగా మారిన ఈ కాలంలో, రాజశేఖర్ నటించిన సినిమాలకి ఓటీటీలు దూరంగా ఉండటం అతని క్రేజ్ ఏమాత్రం మిగలలేదనే సంకేతాలను ఇస్తోంది. అయితే రాజశేఖర్ మాత్రం జ్ఞాపకాలతో జీవించకుండా, కొత్త ప్రయోగాలపై దృష్టి పెడుతున్నారు.
తాజాగా ఒక తమిళ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’ రీమేక్ హక్కులు తీసుకున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది క్రికెట్ నేపథ్యంతో కూడిన వినోదాత్మక ప్రేమకథ. ఓ మధ్య వయస్సు వ్యక్తి, అతని కూతురిని ప్రేమించే యువకుడు — ఇద్దరికీ క్రికెట్ మీద ఉన్న ప్రేమ చుట్టూ కథ తిరుగుతుంది. తమిళనాట ఈ సినిమా మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.
ఈ కథను తెలుగులో రీమేక్ చేయాలంటే, తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూసిన నేపథ్యంలో ఇది తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కానీ రాజశేఖర్ మాత్రం తన వయసుకు తగ్గ పాత్రతో మళ్లీ ప్రేక్షకుల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇది టర్నింగ్ పాయింట్ కావచ్చు.
Recent Random Post:














