
సీనియర్ స్టార్, యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కెరీర్ దాదాపు ముగిసిందనుకున్న టైమ్‌లో ఆయన మళ్లీ కొన్ని స్పెషల్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. శర్వానంద్ హీరోగా చేస్తున్న ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ ఫాదర్ రోల్‌లో కనిపించనున్నారనే విషయం తెలిసిందే. ఈ పాత్ర ఆయనకు మంచి కమ్బ్యాక్ అవుతుందని టాక్.
ఇదే వేగంలో రాజశేఖర్ మరోసారి సోలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో భారీ విజయాన్ని సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అసలుకు దినేష్ చేసిన పాత్రను ఇప్పుడు రాజశేఖర్ పోషించబోతున్నారు. విలేజ్ క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథ తెలుగులో కూడా మంచి వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్‌కి కనిపిస్తోంది.
తెలుగు వెర్షన్‌లో రాజశేఖర్‌తో పాటు విశ్వదేవ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రాజశేఖర్ కుమార్తె నటిస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా, రాజశేఖర్ సరసన శివగామి రమ్యకృష్ణ నటించే అవకాశమూ ఉందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అల్లరి ప్రియుడు నుంచి రాజశేఖర్–రమ్యకృష్ణ జంట చేసిన సినిమాలన్నీ హిట్స్ సాధించడం వల్ల మళ్లీ వీరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రీమేక్‌ను రాజశేఖర్ ఫ్యామిలీ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, డైరెక్షన్ బాధ్యతలు కూడా జీవిత రాజశేఖర్ భుజానికే వెళ్లే అవకాశముంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే ఒటీటీలో అందరూ చూశాక ఈ సినిమాను రీమేక్ చేయడం రిస్క్ అన్న భావన ఉన్నా, తెలుగు ఆడియన్స్‌కు ఇలాంటి విలేజ్-క్రికెట్ ఎమోషనల్ డ్రామాలకు మంచి డిమాండ్ ఉందనే నమ్మకం రాజశేఖర్‌లో కనిపిస్తోంది. దినేష్‌లా పర్ఫెక్ట్‌గా కనిపించడానికి రాజశేఖర్ ప్రత్యేకంగా క్రికెట్ ప్రాక్టీస్ కూడా మొదలెట్టారని టాక్.
ఒకప్పుడు యాక్షన్ హీరోగా ప్రేక్షకుల్ని కట్టిపడేసిన రాజశేఖర్, ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయినా, విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ ద్వారా తిరిగి సెలెక్టివ్‌గా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ‘బైకర్’ మరియు ‘లబ్బర్ పందు’ రీమేక్ రెండు సినిమాలతో ప్రేక్షకులను మరోసారి మెప్పించాలని చూస్తున్నారు.
Recent Random Post:














