
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరైన కంటెంట్ పడితే డార్లింగ్ రికార్డుల దగ్గరికి ఎవ్వరూ చేరలేరు. అయితే ఇటీవల ‘రాజాసాబ్’ సినిమా ఫలితంపై సోషల్ మీడియాలో విభిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ రిలీజ్ తర్వాత వచ్చిన కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఫ్యాన్స్‌ను కాస్త డిస్టర్బ్ చేస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో హిట్‌లు, ఫ్లాప్‌లు సహజమే. ప్రభాస్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరో విషయంలో అంచనాలు ఎప్పుడూ హై లెవెల్‌లోనే ఉంటాయి. ఆ అంచనాలు కొంచెం అటు ఇటు అయినా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవుతుంటాయి. ఇప్పుడు ‘రాజాసాబ్’ ఎఫెక్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఫౌజీ’పై పడుతుందేమో అంటూ కొందరు అనవసర లెక్కలు వేస్తున్నారు. అయితే ప్రభాస్ ట్రాక్ రికార్డ్ తెలిసిన వారికి ఇవన్నీ చిన్న విషయాలే అని చెప్పాలి.
‘ఆదిపురుష్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుందని చాలామంది భావించారు. కానీ అదే సమయంలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘కల్కి’తో డార్లింగ్ ఇచ్చిన కౌంటర్‌కి అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ‘రాజాసాబ్’ ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ అది ప్రభాస్ మాస్ పవర్‌ను ఏమాత్రం తగ్గించలేదు. డార్లింగ్ కెరీర్‌లో ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే.
ఒకే ఒక్క సాలిడ్ హిట్ పడితే ఈ ట్రోల్స్ అన్నీ గాలికి కొట్టుకుపోతాయని ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎమోషన్స్‌ను డీల్ చేయడంలో హను మాస్టర్ అనే పేరు ఉంది. పీరియడ్ స్పై వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఊహించని స్థాయిలో ఉండబోతోందని టాక్. ఫస్ట్ టీజర్ నుంచే సినిమా తన సత్తా చూపిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
అదే విధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ కూడా లైన్‌లో ఉంది. ఒకవేళ ‘స్పిరిట్’ ముందే వచ్చి ఉంటే పరిస్థితి మరింత డిఫరెంట్‌గా ఉండేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఏ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రభాస్ మార్కెట్‌కు డ్యామేజ్ ఉండదన్నది ఫ్యాన్స్ నమ్మకం. ‘ఆదిపురుష్’ టైమ్‌లో వచ్చిన నెగెటివిటీతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం.
ఏదేమైనా ప్రభాస్‌కు ఉన్న నేషనల్ వైడ్ మార్కెట్‌ను అండర్ ఎస్టిమేట్ చేయలేం. ‘రాజాసాబ్’ ఫ్లాప్ అనేది కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే. త్వరలోనే ‘ఫౌజీ’ లేదా ‘స్పిరిట్’తో ప్రభాస్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.
Recent Random Post:















