
‘రాజాసాబ్’ నుంచి తొలి పాట కోసం అభిమానులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కొత్త సినిమాల ప్రమోషన్లు సాంగ్‌తోనే మొదలవుతాయి. చివర్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కానీ ‘రాజాసాబ్’ టీం మాత్రం అలా కాకుండా—రిలీజ్‌కు మూడున్నర నెలల ముందే ట్రైలర్‌ను విడుదల చేసి, ఫస్ట్ సింగిల్‌ను మాత్రం నిన్నటిదాకా వాయిదా వేసింది.
మొన్న విడుదల చేసిన గ్లింప్స్ చూసినప్పుడే ఏదో కరెక్ట్ కాదన్న భావన వచ్చింది. నిన్న సాంగ్ బయటకు రాగానే ఆ అనుమానాలు నిజమయ్యాయి. ‘రెబల్ సాబ్’ అంటూ వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ ఆశించిన స్థాయిలో లేదు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ… తమన్ కంపోజిషన్, సంజిత్ హెగ్డే వాయిస్ కానీ అంతగా కనెక్ట్ కాలేకపోయాయి. పాట మొత్తంలోనూ ఓ రకమైన గోలగా అనిపించింది.
తమన్ అంటే లిరిక్స్‌పై మ్యూజిక్ డామినేషన్ కామన్. కానీ ఈసారి ఆ డామినేషన్ మరీ అతిరేకంగా కనిపించింది. పైగా మ్యూజిక్ కొత్తదనంతో ఆకట్టుకుంటుందా అంటే అదిప్పుడూ లేదు. అయితే విజువల్స్ మాత్రం ఓ మోస్తరు బాగున్నాయి. ‘మిర్చి’ టైమ్‌లోని ప్రభాస్ ఎనర్జీని గుర్తుచేస్తూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే మెప్పించింది. ‘పాన్-ఇండియా నం.1 బ్యాచిలర్’ అన్న ట్యాగ్ కూడా అభిమానులను ఎంటర్టైన్ చేసింది.
అన్నిటిని పక్కనబెడితే—‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ నిరాశపరిచింది అన్న మాట కచ్చితంగా వాస్తవమే. ఇది తమన్ ఇటీవల ఇస్తున్న సాంగ్స్‌లో కనిపిస్తున్న డౌన్‌ట్రెండ్‌లో భాగం. ‘అఖండ-2’ ఆల్బమ్‌లో కూడా పెద్ద హిట్‌గా నిలిచే చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఏవీ రాలేదు. ఒకప్పుడు తమన్ పాటలంటే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతాయని నమ్మకం ఉండేది. కానీ ‘మన శంకర వరప్రసాద్’లో ‘మీసాల పిల్లా’, ‘పెద్ది’లో ‘చికిరి చికిరి’ లాంటి పాటలు దుమ్ము రేపుతుంటే… తమన్ మాత్రం వరుసగా ఫేడ్ అయ్యే ట్రాక్స్ ఇస్తుండడం అభిమానులను ఆశ్చర్యంలో పడేస్తోంది.
Recent Random Post:














