భగవంత్ కేసరితో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా దాదాపు ఫిక్స్ చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ రావిపుడి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజతో అనిల్ రావిపుడి కలిసి మరో సినిమా చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఇద్దరు కలిసి రాజా ది గ్రేట్ సినిమా చేశారు. ఆ సినిమా హిట్ కాగా మళ్లీ చాలా కాలం తర్వాత రవితేజ అనిల్ రావిపుడి కలిసి సినిమా చేయబోతున్నారు.
రాజా ది గ్రేట్ చివర్లో దానికి సీక్వెల్ గా రాజా డబుల్ గ్రేట్ అనే టైటిల్ కూడా వేశారు. మరి ఇప్పుడు దాన్నే తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారా లేదా మరో కొత్త కథతో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాజా డబుల్ గ్రేట్ అయితే మాత్రం రాజా ది గ్రేట్ ని మించి ఉంటుందని మాస్ రాజా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పటాస్ నుంచి F3 వరకు కామెడీనే తన బలమని ప్రూవ్ చేసిన అనిల్ రావిపుడి బాలకృష్ణ భగవంత్ కేసరితో సీరియస్ కథలను కూడా చెప్పగలనని ప్రూవ్ చేసుకున్నాడు.
ఆ సినిమా సక్సెస్ మీట్ లో భగవంత్ కేసరి సినిమా ప్రభావం తన తర్వాత సినిమాల మీద ఉంటుందని అన్నారు. రవితేజతో అనిల్ రావిపుడి కామెడీ విత్ ఎమోషనల్ సబ్జెక్ట్ తో వస్తున్నారని టాక్. అనిల్ ఇప్పటికే కథ రెడీ చేయగా త్వరలోనే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనిల్ రవితేజ సినిమాతో కూడా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.
రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ సినిమా ఉంటుంది. భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్ ఇవ్వడంతో బాలకృష్ణ కూడా అనిల్ రావిపుడితో మరో సినిమా చేసేందుకు రెడీ అంటున్నారట. అనిల్ కూడా బాలయ్య సై అంటే తను కూడా సై అని అన్నాడు. మొత్తానికి అనిల్ తో సినిమాలు చేయబోయే స్టార్ లిస్ట్ బాగానే ఉందని చెప్పొచ్చు. అనిల్ రావిపుడి సినిమా అంటే గ్యారంటీ హిట్ అనే టాక్ వచ్చింది. కచ్చితంగా రాబోయే సినిమాలు కూడా అనిల్ మార్క్ చూపించేలా ఉంటాయని అతని సక్సెస్ మేనియా కొనసాగిస్తాయని చెప్పొచ్చు.
Recent Random Post: