పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. హర్రర్ కామెడీ జోనర్ లో మారుతి తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలవ్వగా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ లుక్స్ తో పాటు మోషన్ పోస్టర్స్ కూడా షేర్ చేసి హైప్ క్రియేట్ చేశారు.
అయితే రాజా సాబ్ రిలీజ్ వాయిదా పడుతుందని రీసెంట్ గా టాక్ రావడం మొదలైంది. అందుకు కారణం సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీ జాక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా ఏప్రిల్ 10న విడుదల చేస్తామని రీసెంట్ గా ప్రకటించారు.
దీంతో రాజా సాబ్ విడుదల పోస్ట్ పోన్ అవ్వనుందని ప్రచారం జరుగుతోంది. వీఎఫ్ ఎక్స్ వర్క్ చాలా పెండింగ్ ఉందని, షూటింగ్ కూడా పూర్తవ్వలేదని సమాచారం. దానికి తోడు ప్రభాస్ తాను గాయపడినట్లు రీసెంట్ గా వెల్లడించారు. ఇప్పుడు రిలాక్స్ డ్ మోడ్ లో ఉన్న ఆయన.. ఇంకొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది.
అలా వివిధ కారణాల వల్ల రాజా సాబ్ రిలీజ్ వాయిదా పడుతుందని తెలుస్తోంది. అందుకే సిద్ధు జొన్నలగడ్డ జాక్ ను అప్పుడు రిలీజ్ చేస్తున్నారన్నమాట! అదే సమయంలో ఏప్రిల్ 10వ తేదీపై జాక్ తోపాటు మరో రెండు చిత్రాలు కన్నేశాయని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. నితిన్ నటిస్తున్న ఓ సినిమా,రాబిన్ హుడ్ అప్పుడే విడుదల అవ్వనున్నాయట.
బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న జాట్ మూవీని రాజా సాబ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తోంది. దీంతో రాజా సాబ్ అనుకున్న తేదీకి ఆ సినిమా బదులు జాట్ ను రిలీజ్ చేయాలని నిర్మాత విశ్వప్రసాద్ భావిస్తున్నారట. నితిన్ కూడా తన మూవీతో రానున్నారని టాక్. అయితే నితిన్ చేతిలో ఇప్పుడు రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.
రాబిన్ హుడ్ క్రిస్మస్ కు వస్తుందని అనుకోగా వాయిదా పడింది. శివరాత్రి కానుకగా రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. అదే సమయంలో తమ్ముడు మూవీ ఫిబ్రవరి 25న విడుదవ్వనుందని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఏప్రిల్ 10న రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు తెలుస్తోంది. అలా మూడు సినిమాలు.. ప్రభాస్ డేట్ పై ఫోకస్ చేశాయన్నమాట.
Recent Random Post: