
ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాకు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆశించిన స్థాయిలో భారీ మొత్తం రాలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన విధంగానే డీల్ క్లోజ్ చేశామని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కొందరు యాంటీ అభిమానులు ప్రభాస్ మార్కెట్ తగ్గిపోయిందంటూ వివిధ రకాల అర్థాలు తీసి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. ఈ ప్రచారం తీవ్రత పెరగడంతో టీజీ విశ్వప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
తమ ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్గత వ్యాపార వివరాలు బహిరంగంగా వెల్లడించడం సాధ్యం కాదని, సినిమా విడుదలైన తర్వాత అధికారికంగా నెంబర్లు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. థియేటర్ అనుభూతిని ఆస్వాదించాల్సిన అభిమానులు ఇలాంటి అపోహలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రస్తుత మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య ‘రాజా సాబ్’కే బెస్ట్ డీల్ దక్కిందని ఆయన నొక్కి చెప్పారు. అనవసర పోలికలు వద్దంటూ ఖచ్చితంగా కొట్టిపారేశారు.
వాస్తవానికి ‘రాజా సాబ్’కి ప్రధాన బలమే ప్రభాస్ ఇమేజ్. అదే కారణంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. హారర్ జానర్ కావడం, దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు వంటి అంశాలు కొంత ప్రభావం చూపినప్పటికీ, పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ‘రాజా సాబ్’ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదనే నమ్మకం టీమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే రెండు టీజర్లు, రెండు పాటలు విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. డిసెంబర్ 27న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా, వేదిక త్వరలో ఖరారుకానుంది. ఈ ఈవెంట్‌లో కొత్త ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. విడుదలకు ముందే మరో రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
భారీ బ్రేక్ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని బరిలోకి దిగుతున్న ‘రాజా సాబ్’కు అవతల అరడజను సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ప్రభాస్ క్రేజ్ ముందు అది పెద్దగా ప్రభావం చూపదన్న నమ్మకంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు.
Recent Random Post:













