
బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2’ను రూపొందించారు. ఈ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా రానా వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రత్యేకంగా సిరీస్‌లో వెంకటేష్‌ను అసభ్య పదజాలంతో తిట్టిన దృశ్యాలపై స్పందిస్తూ రానా మాట్లాడుతూ, “హిందీలో కొన్ని పదాలకు అర్థం తెలియకుండానే మొదటి భాగానికి డబ్బింగ్ చెప్పేశాను. అప్పట్లో వాటిని కేవలం డైలాగ్స్‌గా చూశాను. బాబాయ్‌ను తిడుతున్నాననే ఆలోచన రాలేదు. కానీ తెలుగు డబ్బింగ్ కోసం వచ్చేసరికి చాలా ఇబ్బంది పడిపోయాను. కొన్ని డైలాగ్స్ చెప్పే సమయంలో అసలు ఇవి ఎలా చెప్పాలి? ఏం చేయాలి? అనే ఆలోచన వచ్చేది. అయితే నటనలో పాత్రల్లో పూర్తిగా విలీనం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు అలాంటి డైలాగ్స్ కూడా చెప్పక తప్పదు” అన్నారు.
“ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే బాబాయ్‌తో కలిసి పని చేయాలన్నదే నా కల. ఈ సిరీస్‌తో ఆ కల నెరవేరింది. ఇలాంటి ప్రాజెక్ట్ మేమిద్దరం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఒక నటుడిగా ఆయన నాకు ఎంతో ప్రేరణ ఇచ్చారు. సెట్లో నన్ను మరింత మెరుగుపరచుకునేలా ప్రోత్సహించేవారు. ఇందులో నా పాత్ర పేరు ‘రైనా’. కానీ బాబాయ్ మాత్రం సెట్లో నన్ను ఎప్పుడూ ‘రానా… రానా’ అని పిలిచేవారు,” అన్నారు రానా.
అలాగే, సెట్లో ఉన్నప్పుడు వెంకటేష్ తిడుతున్నారా లేక పాత్రను తిడుతున్నారా అన్నది కొన్నిసార్లు అర్థం కాకపోయేదన్నారు. ఈ సిరీస్‌ను కుటుంబ సభ్యులంతా చూసారని కూడా తెలిపారు.
ఇదిలా ఉండగా, తొలి భాగం విడుదలైన తర్వాత ఈ సిరీస్‌పై వెంకటేష్, రానాలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బాబాయ్ – అబ్బాయ్ కలిసి ఇంత వల్గర్ కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్‌లో ఎందుకు నటించారని పలువురు ప్రశ్నించారు. కేవలం డబ్బుల కోసమే ఇటువంటి బూతు కంటెంట్‌లో నటించారని కొంతమంది విమర్శించారు. ఇప్పుడు సీక్వెల్ విడుదల నేపథ్యంలో వెంకీ, రానాలపై నెట్టింట మరోసారి ఎలా స్పందన వస్తుందో చూడాలి.
Recent Random Post:














