రామాయణంలో ప్రకాష్ పదుకొణేకు అవకాశమేనా?

Share


బాలీవుడ్ లో దీపికా పదుకొణే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. సోలోగా కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని సుఖపూరిత జీవితాన్ని కొనసాగిస్తున్న దీపిక తాజాగా తల్లి బాధ్యతలు కూడా చేపట్టింది. ఐశ్వర్యరాయ్ తరువాత బాలీవుడ్‌లో అంతటి క్రేజ్‌ని సంపాదించుకున్న కొద్దిమందిలో దీపిక ఒకరు.

దీపిక బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదగడం వెనుక చాలానే కష్టాలు ఉన్నాయని తెలిసిందే. అయితే దీపిక తండ్రి ప్రకాష్ పదుకొణే బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకున్నారని అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు ఆయన చిన్న కోరిక ఒకటి తీరబోతుందనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది.

ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించి ప్రకాష్ పదుకొణేకు ఒక పాత్రలో అవకాశం దక్కిందట. అయితే దీన్ని వీలుచేసింది మాత్రం దీపికానే అని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శక నిర్మాతలతో దీపిక మాట్లాడి తండ్రికి ఒక చిన్న పాత్ర కల్పించమని అభ్యర్థించిందట. దీపిక అడిగితే తిరస్కరించే వారు ఎవరు? పైగా దేశానికి ఎన్నో గెలుపులు అందించిన బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొణే కావటంతో ఆ అవకాశం ఖాయమైంది అని చెబుతున్నారు.


Recent Random Post: