
ఇండస్ట్రీలో మాస్ అండ్ క్లాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి చలాకీగా ఉండే ఫన్నీ సైడ్ కూడా ఉందని చాలామందికి తెలిసి ఉండదు. నటన, స్టైల్, ఎమోషన్, ఎనర్జీ అన్నీ తనదైన శైలిలో చూపిస్తూనే… కొన్నిసార్లు పర్సనల్‌గా కొన్ని పేర్లు మర్చిపోవడం చరణ్‌కి అలవాటే. ఇదే విషయాన్ని ‘RRR’ ప్రమోషన్స్‌లో తారక్ సరదాగా బయటపెట్టాడు. దర్శకుడు రాజమౌళి కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు గుర్తు చేశారు. అయితే చరణ్ మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకోకుండా ఓ సరదాగా చూడటం మెయిన్ హైలైట్.
ఇప్పుడు ఇదే అంశాన్ని యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా ప్రమోషన్స్‌లో వినూత్నంగా వినియోగించారు. సినిమా కోసం రూపొందించిన ఓ హ్యూమరస్ ప్రోమోలో చరణ్, సత్య మధ్య జరిగే ఫన్నీ ఎక్స్చేంజ్ హైలైట్ అయ్యింది. ఇందులో చరణ్ సత్యను గుర్తుపట్టకుండా “కిషోర్” అని పిలవడం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచింది. చరణ్ ఫన్నీ టైమింగ్, సత్య షాకింగ్ రియాక్షన్ కలిపి ఆ వీడియోను హిట్ చేశాయి.
ఈ స్కిట్ ఐడియా దర్శకుడు సందీప్ దే అని, అయితే “కిషోర్” అనేది పిలవాలన్న పాయింట్ మాత్రం చరణ్‌దే అని ప్రదీప్ ఒక ప్రెస్మీట్లో వెల్లడించారు. స్కిట్ తర్వాత చరణ్ సినిమా టీమ్‌ను పర్సనల్‌గా ఎంకరేజ్ చేయడమూ, “ముందుగా షో ఉంటే చెప్తే వచ్చేస్తానని” అన్న మాటలు టీమ్‌కు మంచి మోటివేషన్ ఇచ్చాయి.
ఇప్పటికే మహేష్ బాబు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయగా, రామ్ చరణ్ ఫన్నీ స్కిట్ సపోర్ట్ తో సినిమా పబ్లిసిటీ డబుల్ బూస్ట్ అయింది. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కానీ రామ్ చరణ్ చూపించిన సరదా కోణం మాత్రం నెట్లో ఓ హాట్ టాపిక్‌గా మారింది.
Recent Random Post:















