
స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన క్రేజీ ప్రాజెక్ట్ పెద్దితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సమ్మర్ స్పెషల్‌గా థియేటర్లలో విడుదలకానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సినిమా ఏప్రిల్‌కు వాయిదా పడింది. దీంతో రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనున్నారు.
అయితే పెద్ది సంగతి పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే చరణ్ – జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కాంబో రిపీట్ అవుతుందన్న వార్తలతోనే భారీ అంచనాలు మొదలయ్యాయి. రంగస్థలాన్ని మించే కథ, పూర్తిగా మాస్ జోనర్‌లో సినిమా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే షూటింగ్ షెడ్యూల్, ఇతర వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో ప్రారంభించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్‌పై రూపొందుతున్న అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, అనౌన్స్మెంట్ ఆలస్యం అవుతోందనే చర్చ కూడా ఉంది. మే నెలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం.
మరోవైపు, వచ్చే నెలాఖరుకల్లా పెద్ది షూటింగ్‌ను రామ్ చరణ్ పూర్తి చేయనున్నారట. ఆ తర్వాత ప్రమోషన్స్‌లో పాల్గొని, కొద్దిరోజుల గ్యాప్ తీసుకుని సుకుమార్ సినిమాతో ఫుల్‌గా బిజీ అవ్వనున్నారని టాక్. ఇప్పటికే స్టోరీ వర్క్ పూర్తి చేసిన సుకుమార్, ప్రీ-ప్రొడక్షన్ పనులపై ఫోకస్ చేసినట్లు సమాచారం.
అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌ను, వాటికి తగ్గట్టుగానే గ్రాండ్‌గా తెరకెక్కించాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. అన్ని జాగ్రత్తలు తీసుకుని మరో బ్లాక్‌బస్టర్ అందుకోవాలన్నదే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని టాక్. మరి ఈ క్రేజీ రామ్ చరణ్ – సుకుమార్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.
Recent Random Post:















