
ఊహలు గుసగుసలాడే సినిమాతో 2014లో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయిన రాశి ఖన్నా, కొద్దికాలంలోనే తను టాలీవుడ్లో టైర్ 2 హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. నాగచైతన్య, గోపీచంద్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, రవితేజ లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు గోల్డెన్ ఛాన్స్ రాలేదు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్‌తో చిన్న పాత్రలో కనిపించినా, అది ఆమె కెరీర్‌కి పెద్దగా కలిసి రాలేదు.
సన్నగా, గ్లామరస్‌గా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన రాశికి అప్పట్లో కొన్ని మంచి అవకాశాలు వచ్చినా, టాలీవుడ్లో ఓ దశలో గ్యాప్ వచ్చింది. నాగ చైతన్యతో చేసిన “థాంక్యూ” చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, కోలీవుడ్, బాలీవుడ్లవైపు అడుగులు వేసింది. కానీ అక్కడ కూడా మిక్స్డ్ రెస్పాన్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు మాత్రం రాశి ఖన్నా కెరీర్‌కు మళ్లీ జోష్ రానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో శ్రీలీల మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాశి కీలకమైన పాత్రలో కనిపించనుంది.
ఇదే కాకుండా, బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ జోడిగా “నాగ్ జిల్ల” అనే చిత్రంలో నటించనుంది. ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. 2026 ఆగస్టు 14న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాపై రాశి భారీగా నమ్మకాలు పెట్టుకుంది. ఇది హిట్ అయితే బాలీవుడ్లో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ రెండు సినిమాల ఫలితాలపై రాశి భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ రెండు ప్రాజెక్ట్స్ హిట్ అయితే, టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల సరసన లీడ్ ఛాన్సులు రావచ్చని సినీ విశ్లేషకుల అంచనా. దాదాపు 10 ఏళ్లుగా రాశి ఖన్నా పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఈసారి నెరవేరే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2026 రాశి ఖన్నా కెరీర్లో కీలకమైన సంవత్సరం కానుంది. మరి ఈ సారి ఆమె లక్క్ పని చేస్తుందో లేదో చూడాలి!
Recent Random Post:














