
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. “పుష్ప 2: ది రూల్” బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత, తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్‌ను ఇంకా ప్రారంభించలేదు. మూడేళ్ల పాటు పుష్ప సీక్వెల్ కోసం కష్టపడ్డ బన్నీ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నారు. భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్లతో క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో అస్సాంలోని నమేరి నేషనల్ పార్క్ లో కుటుంబంతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా, దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్ తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించారని సమాచారం. దాదాపు రెండు వారాల పాటు ఆయన అక్కడే ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే అమెరికా టూర్ కు వెళ్లిన బన్నీ, మూడు వారాల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కుటుంబంతో కాకుండా సింగిల్ గా వెళ్లిన ఆయన, అక్కడ కొన్ని టూరిస్టు స్పాట్స్ ను సందర్శించి రిలాక్స్ అవుతారని సమాచారం. ఈ ట్రిప్ అనంతరం తిరిగి వచ్చి, తన కొత్త సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారని టాక్.
ఫ్యాన్స్ మాత్రం ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!
Recent Random Post:














