
రీసెంట్ టైమ్స్‌లో హీరోయిన్లుగా ఎక్కువ వినిపిస్తున్న పేర్లు రష్మిక మందన్నా, శ్రీలీల, కియారా, భాగ్య శ్రీ బోర్సే. ఇలాంటి సీనియర్ హీరోయిన్‌ల లిస్ట్‌లో, కన్నడ నటి రుక్మిణి వసంత్ తన ప్రత్యేక ప్రయత్నాలతో తాను కూడా రేసులో ఉండేలా చేసుకున్నారు. కాంతార్ చాప్టర్ 1 లో రాజ కుమారి పాత్రలో రుక్మిణి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
సప్తసాగరాలు దాటి ఫ్రాంచైజ్ సినిమాల్లో నటించి, తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణి, తరువాత తెలుగులో నిఖిల్ హీరోగా అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో సినిమాలో నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, రుక్మిణికి అవకాశాలు వరుసగా వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు రుక్మిణి ఎన్‌టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, కాంతార్ సినిమాలో మంచి బ్లాక్‌బస్టర్ అందుకోవడం వల్ల, ఈ సినిమా తరువాత ఆమెకు అవకాశాలు విపరీతంగా వేరే పాన్ ఇండియా సినిమాల్లో వస్తున్నాయి. రామ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో కూడా ఆమె ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాక, రుక్మిణి మరో తెలుగు సినిమాలో కూడా సైన్ చేసినట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఫైనల్ అయి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు ఉన్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాతో గుడ్ హిట్ మరియు సాలిడ్ కంబ్యాక్ కొరకు ప్రయత్నిస్తున్నారు.
Recent Random Post:















