
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా రోమ్ నగరానికి వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘మైసా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందింది. షూటింగ్‌కు కొంత విరామం లభించడంతో రష్మిక ఈసారి స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం, రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రోమ్ నగరానికి టూర్‌కు వెళ్లింది. అక్కడ తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ పూర్తి స్థాయిలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక, రోమ్ వీధుల్లో తిరుగుతూ, అక్కడి స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
అయితే రష్మిక పంచుకున్న ఫోటోలు అభిమానుల్లో కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి. ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలలో ఆనంద్ దేవరకొండ కనిపించడం ప్రధాన చర్చకు దారి తీసింది. అంతేకాదు, రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ విడివిడిగా వీడియోలు షేర్ చేసినప్పటికీ, వాటిలో కనిపించిన ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ ఒకటే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ రోమ్ ఫోటోలు కూడా వైరల్ కావడంతో, రష్మిక నిజంగానే విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిందని నెటిజన్స్ కన్ఫామ్ చేస్తున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉండగా, మరోవైపు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి చేతుల్లో కనిపించిన ఉంగరాలే ఇందుకు కారణమని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల ఓ స్టూడెంట్స్ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మిక, విజయ్ దేవరకొండను వివాహం చేసుకోబోతున్నానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం ‘సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను’ అంటూ స్పష్టత ఇచ్చినా, పెళ్లి తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Recent Random Post:















