రోషన్‌కి ‘ఛాంపియన్’తో లక్ తిరిగిందా?

Share


ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ ఛాంపియన్ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. సినిమాలో రోషన్ లుక్ మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుంది. నిజంగా రామ్ చరణ్ చెప్పినట్లే, అతడు యూరోపియన్ యాక్షన్ స్టార్‌ను తలపించేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో రోషన్ లుక్‌నే ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

అయితే, రోషన్ నుంచి ప్రేక్షకులు కోరుకుంటోంది కేవలం లుక్ మాత్రమే కాదు. అతడికి సరిపోయే ఓ సాలిడ్ కమర్షియల్ హిట్ ఇప్పుడు చాలా అవసరం. అతడిని హీరోగా పెట్టి భారీ స్థాయి ప్రాజెక్ట్ రూపొందితే, అది సక్సెస్ అయితే నిజంగా రోషన్ యూరోపియన్ రేంజ్ యాక్షన్ స్టార్‌గా మారే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

దానికి అతడిని సరైన దిశలో తీర్చిదిద్దే దర్శకుడు అవసరం. ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు చిన్న బ్యానర్లలో నటించిన రోషన్‌కు ఇప్పుడు పెద్ద అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రోషన్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి నిర్మాత నాగవంశీ రెడీ అవుతున్నాడు. కథ, దర్శకుడి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, నాగవంశీ టేస్ట్‌కు తగ్గట్టే ఈ సినిమా ఉండబోతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుత నిర్మాతలలో నాగవంశీ అడ్వాన్స్డ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఆలోచించే నిర్మాతగా పేరుంది. స్క్రిప్టులపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఈ అంశం రోషన్‌కు కలిసొచ్చే పెద్ద ప్లస్‌గా చెప్పుకోవచ్చు.

అలాగే, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రోషన్‌తో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛాంపియన్ సినిమా చూసిన తర్వాతే అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రోషన్‌లోని టాలెంట్‌ను గుర్తించిన అరవింద్, అతడికి సరైన కథ పడితే గ్లోబల్ రేంజ్ నటుడిగా ఎదగగలడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే భారీ ప్రయోగం చేయకపోయినా, భవిష్యత్తులో ఆ స్థాయి ప్రయత్నం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.

ప్రస్తుతం మాత్రం రోషన్‌తో ఓ పక్కా కమర్షియల్ సినిమా చేయాలనే ఆలోచనలో అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ల నుంచి అవకాశాలు రావడం రోషన్‌కు నిజంగా లక్కీ బ్రేక్. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మరోటి ఉండదు.

రోషన్ కష్టపడి, సరైన ఎఫర్ట్ పెట్టి పని చేస్తే, నాగవంశీ, అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు అతనిలోని బెస్ట్ యాక్టర్‌ను బయటకు తీసుకురాగలరు. తండ్రి శ్రీకాంత్ కూడా రోషన్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ ఆశలు ఒత్తిడిగా మారకుండా, రోషన్ తన ప్రయాణాన్ని నెమ్మదిగా కానీ బలంగా కొనసాగిస్తున్నాడు.


Recent Random Post: