లోకా చాప్టర్-1: చంద్ర ఘన విజయం, లోకా 2 పై పనులు ప్రారంభం

Share


సూపర్ హీరో జానర్‌లో తెర‌కెక్కిన మ‌ల‌యాళ చిత్రం లోకా చాప్టర్-1: చంద్ర గ్రాండ్ సక్సెస్ సాధించింది. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దుల్క‌ర్ స‌ల్మాన్ నిర్మించారు. అయితే, దుల్క‌ర్ నిర్మాత అయినప్పటికీ ఓటీటీ హక్కుల కోసం ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్నిచ్చింది. ఇటీవల ఇంటర్వ్యూలో దుల్క‌ర్ స్వయంగా దీన్ని ధృవీకరించారు.

“మేము బడ్జెట్ పరిమితులను మించిపోయాము, రెండింత‌లకు చేరాం. ఎవరు సినిమాను కొనడానికి ఆసక్తి చూపించలేదు. టోవినో, నేను అక్కడ ఉన్నాము.. కానీ మీరు కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారు!” అని దుల్క‌ర్ చెప్పారు.

పెద్ద తార‌ల స్క్రీన్ టైమ్ కూడా ఓటీటీ ఒప్పందాలకు ప్రభావం చూపుతుందని దుల్క‌ర్ తెలిపాడు. పెద్ద తారలు ఎక్కువ స్క్రీన్ టైమ్ కలిగి ఉంటే, ఓటీటీలు ఎక్కువ చెల్లిస్తాయి అని కూడా ధృవీకరించారు.

అయితే లోకా చాప్టర్-1: చంద్ర బాక్సాఫీస్ వద్ద పెద్ద సర్ప్రైజ్ క్రియేట్ చేసింది. ప్రధాన తారలు లేకుండానే, ఈ సినిమా ఘన విజయం సాధించి, మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శన్ కి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

చిత్రం జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రావడానికి ముందే రెండు నెలల పైగా థియేటర్లలో నిలకడగా ప్రదర్శితమైంది. భారీ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు విక్రయించబడ్డాయి. మాలీవుడ్లో ఇది అత్యంత మంచి ధరకు విక్రయించిన సినిమా అని కూడా కథనాలు వచ్చాయి.

ప్రస్తుతం, మేకర్స్ లోకా చాప్టర్-2 పై పని ప్రారంభించారు. ఇందులో టోవినో పాత్ర చాతన్ చుట్టూ కథాంశం కేంద్రీకృతమై ఉంటుంది. దుల్క‌ర్ సల్మాన్ సహా మరికొందరు పెద్ద స్టార్‌లను కూడా నటించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి స్టార్ పవర్‌ను పెంచి పాన్ ఇండియాలో ప్రభావం చూపడానికి దుల్క‌ర్ సిద్ధంగా ఉన్నారు.


Recent Random Post: