వంద కోట్ల ఉప్పెన.. ఇద్దరు మునిగిపోయారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జోడిలలో వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. వీళ్ళ అదృష్టానికి తగ్గట్టుగా మొదటి సినిమా కథపరంగా అలాగే యాక్టింగ్ పరంగాను అన్ని అంశాలు కలిసి రావడంతో మంచి గుర్తింపు లభించింది.

ఆ సినిమా థియేట్రికల్ గా అలాగే నాన్ థియేట్రికల్ గా మొత్తంగా 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది.. ఇక సౌత్ ఇండస్ట్రీలో బెస్ట్ డెబ్యూ ఇచ్చిన హీరో హీరోయిన్గా కూడా క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ క్రేజ్ను మాత్రం ఈ జోడి సరైన పద్ధతిలో వాడుకోలేకపోయింది. తెలిసి చేశారో తెలియక చేశారు కానీ కొన్ని రిస్కులు తీసుకుని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పెన సినిమాతో ఎంత త్వరగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్నారో అంతే త్వరగా డౌన్ ఫాల్ కూడా అవుతున్నారు.

ఇప్పుడు మినిమం సక్సెస్ అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే అవకాశాలు కూడా తగ్గుతూ ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ అయితే ఒక విధంగా చేతులారా తనకు సెట్ అవ్వని కమర్షియల్ కథలు చేసే డిజాస్టర్ తో మార్కెట్ కోల్పోయాడు. రెండవ సినిమా కొండపొలం కంటెంట్ పరంగా పరవాలేదు కానీ ఆ తర్వాత వచ్చిన రంగా రంగా వైభవంగా.. ఆదికేశవ అనే రెండు సినిమాకు కూడా రొటీన్ ఫార్మాట్లో వచ్చాయి.

ఈ సినిమా కథలు విన్నప్పుడే రిజెక్ట్ చేసేయవచ్చు కానీ వైష్ణవి ఎలా ఒప్పుకున్నాడో అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక హీరో కంటే బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టికి ఉప్పెన సినిమా ద్వారా ఎక్కువ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఆ వెంటనే ఆమె రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.

ఇక ఆమె కొన్ని కమర్షియల్ సినిమాలను పారితోషకం కోసం ఆలోచించి చేయడం కూడా తప్పయింది. మరికొన్ని కంటెంట్ ఉన్న సినిమాలు కూడా బెడిసి కొట్టాయి. ఉప్పెన తర్వాత కేవలం శ్యామ్ సింగరాయ్ మాత్రమే ఆమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ను ఇచ్చింది. ఆ తరువాత బంగార్రాజు పరవాలేదు అనిపించింది. అనంతరం దివారియర్, మాచర్ల నియోజకవర్గం రెండు కూడా కమర్షియల్ ఫార్మాట్లో వచ్చే డిజాస్టర్ అయ్యాయి.

అనంతరం సుధీర్ బాబుతో చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక నాగ చైతన్య కస్టడీ కూడా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు ఈ విధంగా అమ్మడు మీడియం రేంజ్ హీరోలతో చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఏదేమైనా కూడా కృతి శెట్టి వైష్ణవ తేజ్ ఇద్దరు కూడా ఉప్పెన క్రేజ్ ను నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇక వైష్ణవ్ కు తర్వాత సినిమాలపై కూడా ఈ డిజాస్టర్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కృతి శెట్టికి ప్రస్తుతం కేవలం ఒక సినిమా మాత్రమే చేతిలో ఉంది. అది కూడా సక్సెస్ ట్రాక్ లో లేని శర్వానంద్ కొత్త దర్శకుడు తో చేస్తున్న సినిమా. మరి ఈ సినిమాతో ఆమెకు సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.


Recent Random Post: