వంశీ–సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్ ఫైనల్!

Share


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ Vamshi Paidipally ‘వారసుడు’ తర్వాత కొంతకాలంగా కొత్త ప్రాజెక్ట్ లేక ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలంతా తమ తమ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటంతో, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ వంశీకి కొత్త సినిమా ప్రారంభం ఆలస్యమైంది.

అయితే ఇప్పుడు ఆయనకు బిగ్ బ్రేక్ దక్కినట్టే కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో Salman Khanతో వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ ఫైనల్ కాగా, ప్రముఖ నిర్మాత Dil Raju ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ముందుకొచ్చారు. దీంతో టాలీవుడ్–బాలీవుడ్ వర్గాల్లో ఈ కాంబినేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

ఈ ప్రాజెక్ట్ కోసం వంశీ గత ఏడాది నుంచే స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, తన స్టైల్‌లో ఎమోషన్స్, స్టైలిష్ యాక్షన్‌ను మేళవించి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కథ విన్న సల్మాన్ కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఏప్రిల్‌లో ముహూర్తంతో షూటింగ్ ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరుచుకోవాలని దిల్ రాజు భావిస్తున్నారని టాక్. ఇప్పటికే తెలుగులో అనేక బ్లాక్‌బస్టర్లు అందించిన ఆయన, సల్మాన్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్‌తో సినిమా చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు పాన్-ఇండియా స్థాయిలో భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ఎక్కడా రాజీ పడటం లేదని సమాచారం. వంశీ పైడిపల్లి సినిమాల్లో హీరోలను స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ప్రెజెంట్ చేయడం ప్రత్యేకత. ‘బృందావనం’, ‘ఎవడు’, ‘మహర్షి’ చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ ఆడియన్స్‌కు నచ్చే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, సౌత్ స్టైల్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఇతర బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, వంశీ సినిమా కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమై, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రంతో వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లో అడుగు పెట్టడం విశేషం.

మొత్తానికి టాలీవుడ్ డైరెక్టర్ – బాలీవుడ్ సూపర్ స్టార్ – క్రేజీ ప్రొడ్యూసర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Recent Random Post: