
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కాస్త తడబడిన దశలో ఉంది. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత ఆయన సినిమాలకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. తాజాగా వచ్చిన ‘ఓపెనింగ్ మట్కా’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వరుణ్ ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా ఉండాలని, కొత్త కథలతో ప్రయోగాలు చేయాలని తపనతో ముందుకు సాగుతున్నా, అవి ఫలితాలు ఇవ్వకపోవడం కొంత నిరాశ కలిగించింది.
ఈ సారి మాత్రం పక్కా ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రావాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యాడు. ఆయన తాజాగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక కొరియన్ హిట్ డ్రామాను ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. షూటింగ్ మొదటి రోజునుంచే యూనిట్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ హైలైట్ కానుందని సమాచారం.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనుండగా, థ్రిల్లర్ సినిమాలకి ఆయన అందించే బిజిఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వరుణ్ తేజ్ 15వ సినిమా అయిన ఈ ప్రాజెక్ట్‌ను మాస్‌కి నచ్చేలా, క్రియేటివ్ టచ్‌తో డిజైన్ చేస్తున్నారని టాక్.
ఈ సారి అయినా వరుణ్ తేజ్ కు బ్లాక్‌బస్టర్ హిట్ పడుతుందా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన చర్చగా మారింది.
Recent Random Post:














