మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లావణ్య త్రిపాఠి సైడ్ అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు అలాగే మెగా హీరోలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
అయితే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో లు మాత్రమే పెద్దగా బయటకు రాలేదు. చాలా ప్రైవేటు గానే వెడ్డింగ్ జరిగినప్పటికీ కొన్ని ఫోటోలు మాత్రం లీక్ అయ్యాయి. అంతేకాకుండా నాగబాబు కొన్ని ఫోటోలు కూడా అఫీషియల్ గా విడుదల చేశారు. అయితే ఊహించలేని వార్త ఒకటి సోషల్ మీడియాలో గత రాత్రి చాలా వైరల్ గా మారిపోయింది.
వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మొత్తం కూడా ఒక ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని, స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ రేటును కూడా ఆఫర్ చేసింది అన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఎక్కువగా అయితే నెట్ ఫ్లిక్స్ ట్రెండ్ అయ్యింది. వాళ్లు దాదాపు 8 కోట్లు ఇచ్చి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నారు అని టాక్ వినిపించింది.
ఇక ఈ విషయాన్ని మెగా సన్నిహితులకు తెలియడంతో అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని గంటల నుంచి వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు అని ఏ ఓటీటీ సంస్థకు కూడా పెళ్లికి సంబంధించిన డీల్స్ కుదుర్చుకోలేదు అని వరుణ్ తేజ్ టీం క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా ఇలాంటి గాసిప్స్ రూమర్స్ ను ఎవరూ నమ్మకూడదు అని వాళ్ళు వివరణ ఇచ్చారు. దీంతో మొత్తానికి ఈ విషయంలో మెగా ఫాన్స్ కు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
గతంలో నయనతార విగ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని చాలా రకాలగా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ అది. కనిపించలేదు. ఎవరు కూడా దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లిపై కూడా అదే తరహాలో వార్తలు రావడంతో అతని టీం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
Recent Random Post: